‘జగనన్న సురక్ష’తో కార్పొరేట్‌ వైద్యం

ప్రజాశక్తి-కురిచేడు : పేద ప్రజలకు కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందించడమే జగనన్న సురక్ష పథకం యొక్క ఉద్దేశమని జడ్‌పిటిసి నుసుం వెంకట నాగిరెడ్డి తెలిపారు. స్థానిక బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో కురిచేడు సర్పంచి కేశనపల్లి కృష్ణయ్య అధ్యక్షతన జగనన్న ఆరోగ్య సురక్ష రెండవ విడత కార్యక్రమాన్ని మంగళవారం నిర్వమించారు. కురిచేడు పంచాయతీ పరిధిలోని గొల్లపాలెం, కాటంవారిపల్లె, పేరంబొట్లపాలెం, కురిచేడు గ్రామాల ప్రజలు వైద్య పరీక్షలు చేయించున్నారు. ఈ కార్యక్రమంలో కురిచేడు వైద్యాధికారి డాక్టర్‌ ప్రవీణ్‌, ఎఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, ఎంపిటిసి బుల్లం వెంకట నరసయ్య, కురిచేడు మాజీ సర్పంచి ఆవుల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిఎస్‌ పురంరూరల్‌ : మండల పరిధిలోని చెన్నపనాయునిపల్లి సచివాలయం వద్ద జగనన్న ఆరోగ్య సురక్ష వైద్యశిబిరం నిర్వహించారు. ఈ వైద్యశిబిరాన్ని వైసిపి మండల అధ్యక్షుడు భువనగిరి వెంకటయ్య, ఎంపిడిఒ రామచంద్రరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా 309 మందికి వైద్య చికిత్సలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచి పెద్ద సుబ్బయ్య, హ్యూమన్‌ రైట్స్‌ అధ్యక్షుడు షేక్‌ గౌస్‌, వైసిపి యూత్‌ మండల అధ్యక్షుడు బొర్రాజు రమణయ్య, షేక్‌ రజాక్‌, వైద్యులు, వైద్యసిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు గురవయ్య, షేక్‌ నాయబ్‌ రసూల్‌, ఎఎన్‌ఎం, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

➡️