జగన్‌తోనే రాష్ట్రాభివృద్ధి : మంత్రి

ప్రజాశక్తి-యర్రగొండపాలెం : జగనన్నతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివద్ధి శాఖ మంత్రి ఆదిములపు సురేష్‌ అన్నారు. యర్రగొండపాలెం బుధవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. నూతన భవనాలకు శంకుస్థాపన చేశారు. తొలుత యర్రగొండపాలెం పట్టణంలో స్వయం సహాయక సంఘాల పొదుపు మహిళల కోసం నిర్మించిన శ్రీశక్తి భవనాన్ని ప్రారంభించారు. అనంతరం సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పొదుపు సంఘాల గ్రూపు మహిళలకు ఎస్‌సి,ఎస్‌టి సబ్‌ ప్లాన్‌ ద్వారా మంజూరైన కుట్టు మిషన్లు, ఆటోలు పంపిణీ చేశారు. పట్టణంలో నూతనంగా నిర్మించిన డ్రైనేజీ కాలువలు, సిసి రోడ్లను ప్రారంభించారు. పీడీసీసీ నూతన బ్యాంకు భవనం, మార్కెట్‌ యార్డ్‌ ఆవరణలో గోడౌన్‌ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం లబ్ధిదారులకు పింఛన్లు పంపినీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి జిల్లా ఉపాధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి, ఎంపిపి దొంత కిరణ్‌ గౌడ్‌, పుల్లలచెరువు ఎంపిపి కందుల వెంకటయ్య, జడ్‌పిటిసి విజయ భాస్కర్‌, వైస్‌ ఎంపిపి మందుల అదిశేషు, డిఎల్‌డిఒ సాయికుమార్‌, ఎంపిడిఒ నాగేశ్వర్‌ప్రసాద్‌, తహశీల్దారు రవీంద్రారెడ్డి, ఎంఇఒ ఆంజనేయులు, సర్పంచి రామావత్‌ అరుణబాయి, ఇఒఆర్‌డి ఈదుల రాజశేఖర్‌ రెడ్డి, వైసిపి మండల కన్వీనర్లు కొప్పర్తి ఓబుల్‌రెడ్డి, బివి.సుబ్బారెడ్డి, సచివాలయ మండల కన్వీనర్‌ సయ్యద్‌ జబివుల్లా, నాయకులు నర్రెడ్డి వెంకటరెడ్డి, ఎర్రంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, రాములు నాయక్‌ పాల్గొన్నారు.

➡️