‘జనన మరణ నమోదు బాధ్యతగా చేపట్టాలి’

ప్రజాశక్తి – కడప అర్బన్‌ ప్రతి ఆరోగ్య కేంద్రంలో జనన, మరణ నమోదు ప్రక్రియను విధిగా, బాధ్యతగా చేపట్టాలని ఎపి, తెలంగాణ ఉభయ రాష్ట్రాల జనన మరణ గణాంకాల శాఖ డైరెక్టర్‌ పి.బాల కిరణ్‌ వైద్యాధి కారులకు సూచించారు. మంగళవారం రిమ్స్‌ మెడి కల్‌ కళాశాలలో సివిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌ ( సిఆర్‌ ఎస్‌) అమలు, నిర్వహణపై జిజిహెచ్‌ సూపరిం టెండెంట్‌ డాక్టర్‌ రమాదేవి అధ్యక్షతన సమీక్ష సమా వేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర జనన మరణ గణాంకాల శాఖ డైరెక్టర్‌తోపాటు పి.బాల కిరణ్‌, కడప నగర కమిషనర్‌, రిమ్స్‌ ప్రత్యేకాధికారి జిఎస్‌ఎస్‌ ప్రవీణ్‌ చంద్‌, డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ నాగరాజు హాజరయ్యారు. గణాంకాల శాఖ డైరెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని రిజిస్ట్రేషన్‌ యూని ట్లను కలిగిన ఆరోగ్య కేంద్రాల్లో జనన మరణ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ jyఃస్త్ర వైద్యాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. జనన మరణాల రిజిస్ట్రేషన్‌ వ్యవస్థలో మూడు అంచల ఉద్దేశాలు న్నాయని చెప్పారు. కడప నగర కమిషనర్‌ మాట్లాడుతూ జిల్లా జనాభా 22,13,911 కాగా జిల్లాలోని 36 మండలాలలో మొత్తం 618 జనన, మరణ నమోదు యూనిట్లు ఉన్నాయన్నారు. అందు లో వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో 62 కాగా మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ పరిధిలో 8, గ్రామ పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో 548 రిజిస్ట్రేషన్‌ యూనిట్లు ఉన్నాయని వివరించారు. పట్టణ ప్రాంతాల్లో చుస్తే. కడప నగరంలోనే 49 సిఆర్‌ ఎస్‌ రిజిస్ట్రేషన్‌ యూనిట్లు, ప్రొద్దుటూరులో 40 ఉన్నాయన్నారు. రిమ్స్‌ జిజి హెచ్‌ సూపరింటెండెంట్‌ కడప జిజిహెచ్‌లో 2016 మే సివిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌ (సీఆర్‌ఎస్‌) ప్రారం భమైందని అప్పటి నుంచి 2023 నవంబర్‌ వరకు 62,831 జననాలు, 14,356 మరణాలు నమోద య్యాయన్నారు. పిపిటి ద్వారా రిమ్స్‌ జిజిహెచ్‌ పరిధిలో అమలవుతున్న జనన, మరణ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను వివరించారు. జనన మర ణాల రిజిస్టర్లు మే, 2016 నుంచి ఇప్పటి వరకు అన్నింటినీ నెల వారీగా కంప్యూటరైజ్డ్‌, బైండింగ్‌ చేసి భద్రప రుస్తున్నామని డైరెక్టర్‌కు తెలియజేశారు. కార్యక్ర మంలో రిమ్స్‌ మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డా. సురేఖ, సిఎస్‌ ఆర్‌ఎంఒ డాక్టర్‌ శ్రీనివాసులు, ఎమర్జెన్సీ విభాగాధిపతి డా. సురేశ్వర్‌ రెడ్డి, అన్ని విభాగాల హెచ్‌ఓడిలు పాల్గొన్నారు.

➡️