జనవరిలో టిడిపిలోకి పలువురు..

నియోజకవర్గ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు

ప్రజాశక్తి – భీమడోలు

జనవరిలో టిడిపిలోకి పలువురు చేరనున్నారని ఆ పార్టీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు తెలిపారు. భీమడోలులోని పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఉంగుటూరు మండలం విఎ.పురం గ్రామ సర్పంచి సింగలూరు ధర్మారావుతో పాటు అదే గ్రామానికి చెందిన ప్రముఖులు కోకా సత్యనారాయణ, ఇతరులు పార్టీలో చేరారు. పార్టీ కండువాలతో వీరిని సత్కరించిన గన్ని వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సిరిబత్తిన కొండబాబు, దూసనపూడి పుల్లయ్య నాయుడు, అధిక సంఖ్యలో ఉంగుటూరు మండలానికి చెందిన టిడిపి నాయకులు పాల్గొన్నారు.

➡️