జర్నలిస్టుల హౌసింగ్‌ సొసైటీ ఏర్పాటు చేసుకోవాలి

Feb 7,2024 21:59

జర్నలిస్టుల హౌసింగ్‌ సొసైటీ ఏర్పాటు చేసుకోవాలి
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
జర్నలిస్ట్‌ల హౌసింగ్‌ సొసైటీ ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షన్మోహన్‌ పాత్రికేయులకు సూచించారు. బుధవారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పి.శ్రీనివాసులు, డిఆర్‌ఓ పుల్లయ్యలతో కలసి జర్నలిస్ట్‌ హౌసింగ్‌ కమిటీ జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ… జర్నలిస్ట్‌ల హౌసింగ్‌ కొరకు గుర్తించిన భూమిని సర్వే చేసి సరిహద్దు రాళ్లను ఏర్పాటు చేయాలని, జర్నలిస్ట్‌ల హౌసింగ్‌ సొసైటీ ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. పుంగనూరు, వి.కోటకు సంబంధించి భూమిని త్వరితగతిన గుర్తించాలని పలమనేరు ఆర్‌డిఓను ఆదేశించారు. సమావేశంలో చిత్తూరు, పలమనేరు, కుప్పం ఆర్డీఓలు చిన్నయ్య, మనోజ్‌ కుమార్‌ రెడ్డి, శ్రీనివాసులు, డిస్ట్రిక్ట్‌ ల్యాండ్స్‌ అండ్‌ సర్వే అధికారి గౌస్‌ బాషా, కమిటీ మెంబెర్స్‌ సహదేవ, జయరాజ్‌, సయ్యద్‌ అక్రమ్‌, డిఐపిఆర్‌ఓబి.పద్మజ, చిత్తూరు గుడిపాల తహశీల్దార్లులు శ్రీనివాసరెడ్డి విజయలక్ష్మి, డిప్యూటీ తహసీల్దార్‌ కిరణ్‌, చిత్తూరు ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షులు, సెక్రెటరీలు లోకనాథం, అశోక్‌ కుమార్‌, పాత్రికేయులు పాల్గొన్నారు.

➡️