జాతీయ తైక్వాండో పోటీల్లో పతకాల పంట

Dec 7,2023 21:45

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :  ఈనెల 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు ఉత్తరాఖండ్‌ రాష్ట్రం డెహ్రాడూన్‌లో జరిగిన సబ్‌ జూనియర్‌ క్యాడెట్‌ తైక్వాండో పోటీల్లో జిల్లాకు పతకాల పంట పండింది. గ్రూప్‌ విభాగం- సిల్వర్‌ మెడల్‌ కుశాల్‌, పునీత్‌, సాత్విక్‌, పెయిర్‌ విభాగంలో బ్రాంజ్‌ మెడల్‌ సంకీర్తన, కుశాల్‌ గుణదీప్‌, క్యారుగీ విభాగంలో కె . సాహిత్య – సిల్వర్‌ మెడల్‌ , వి దేవన్‌ మణికంఠ – బ్రాంజ్‌ మెడల్‌, చరిష్మా – బ్రాంజ్‌ మెడల్‌బి కైవసం చేసుకున్నారు. జిల్లాకు చేరుకున్న వీరికి రైల్వేస్టేషన్‌లో తైక్వాండో అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గురాన అయ్యలు, సిహెచ్‌ వేణుగోపాలరావు స్వాగతం పలికారు.

➡️