జాతీయ స్థాయి వెయిట్‌ లిఫ్టింగ్‌లో సుస్మిత ప్రతిభ

Jan 1,2024 20:04

ప్రజాశక్తి – నెల్లిమర్ల :  జాతీయ స్థాయి పురుష మహిళా వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో యువజన విభాగంలో కొండవెలగాడకు చెందిన వల్లూరు సుస్మిత రజిత పతకం సాధించింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ ఇటానగర్‌ రాజీవ్‌ గాంధీ యూనివర్సటీలో గత నెల 28 నుంచి జరుగుతున్న జాతీయ స్థాయి మెన్‌, ఉమెన్‌, యూత్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీల్లో పాల్గొన్న సుస్మిత 55 కిలోల విభాగంలో స్నాచ్‌ 77 కిలోలు, క్లీన్‌ అండ్‌ జర్క్‌ 96 కిలోలు మొత్తం 173 కిలోలు బరువెత్తి రజత పతకం సాధించారు. ఈ సందర్భంగా సుస్మితను జిల్లా వెయిట్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ బి.లక్ష్మీనారాయణ, స్టేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ బి. వెంకట రామయ్య, బి.లక్ష్మీ, కోచ్‌ చల్లా రాము అభినందించారు.

➡️