జాబ్‌ మేళాలతో ఉపాధి కల్పన : మంత్రి

ప్రజాశక్తి-కొండపి : నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు మోగా జాబ్‌ మేళాను నిర్వహించినట్లు రాష్ట్ర పురపాలక మంత్రి, వైసిపి కొండపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎంప్లాయిమెంట్‌ ఎక్స్జేంజ్‌ సీడప్‌ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక కామేపల్లి రోడ్డులో సీతారామ కళ్యాణమండపంలో గురువారం నియోజకవర్గ స్థాయిలో మోగా జాబ్‌ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్‌ మాట్లాడుతూ యువత జాబ్‌మేళాలను సద్వినియోగం చేసుకొని ఉపాధి పొందాలన్నదే ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్‌రెడ్డి ఉద్దేశ్యమని తెలిపారు. ఇలాంటి జాబ్‌ మేళాలను ప్రతి నెలా నిర్వహించనున్నట్లు తెలిపారు. జాబ్‌ మేళాకు 420 హాజరయ్యారు. అందులో 309 మంది సెలెక్ట్‌ అయ్యారు. 111 మంది షార్ట్‌ లిస్ట్‌ అయ్యారు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పన అధికారి టి.భరద్వాజ్‌, జె.రవితేజ,తహశీల్దారు కిరణ్‌కుమార్‌, నాయకులు మారెడ్డి వెంకటాద్రిరెడ్డి, ఆరికట్ల కోటిలింగయ్య, బొక్కిసం ఉపేంద్రచౌదరి, జి.మురళి, రవిరెడ్డి, పిచ్చిరెడ్డి, ఎలమాల మాధవి, శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

➡️