జీతాలు పెంచకుండా సమ్మె విరమించం

Jan 19,2024 23:45
తమ న్యాయమైన

ప్రజాశక్తి – యంత్రాంగం

తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్‌వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారానికి 39వ రోజుకు చేరింది. జిల్లావ్యాప్తంగా మండల, డివిజన్‌, జిల్లా స్థాయిల్లో జరుగుతున్న శిబిరాల్లో వివిధ రూపాల్లో తమ నిరసనను వ్యక్తం చేశారు. అంగన్‌వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండివైఖరిని నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శనివారం రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకో నిర్వహించేందుకు ఆయా సంఘాలు పిలుపునిచ్చాయి.

కాకినాడ స్థానిక ధర్నా చౌక్‌ వద్ద 24 గంటల రిలే నిరహార దీక్షలను సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జి, జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్‌వాడీ వర్కర్లు న్యాయమైన డిమాండ్లపై సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం కుట్రలు సాగిస్తున్నారని అన్నారు. శుక్రవారం విధులకు జాయిన్‌ కాకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ఐసిడిఎస్‌ అధికారులు నుంచి మెసేజ్‌లు, ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని, ఈ బెదిరింపులకు అంగన్‌వాడీలు బెదిరిపోరని గుర్తుంచుకోవాలని అన్నారు. అంగన్‌వాడీలకు ఈనెల 20వ తేదీన కేంద్ర కార్మిక సంఘాలు, సిఐటియు అనుబంధ సంఘాలు సంయుక్తంగా రాస్తారోకో నిర్వహించడం జరుగుతుందని, ఈ ఆందోళన రాష్ట్రమంతా జరుగుతాయని వారు తెలిపారు. దీక్షా శిబిరంలో సిఐటియు కాకినాడ నగర అధ్యక్షులు పలివెల వీరబాబు స్వతంత్ర పోరాట చరిత్రను కార్మికు లకు వివరించి అంగన్‌వాడీల్లో చైత న్యాన్ని నింపారు. దీక్ష శిబిరానికి మద్ద తుగా ఆశ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నర్ల ఈశ్వరి, చంద్రమల్ల పద్మ, అంగన్‌వాడీ యూని యన్‌ జిల్లా అధ్యక్షులు దడాల పద్మ మాట్లాడారు. అంగన్‌వాడీలు దుర్గా వసంతకుమారి, కె.రత్నకుమారి, ఎన్‌. అనంతలక్ష్మి, పి.నిర్మల, ఆర్‌టి. ఉష లక్ష్మి, కె.కమలాదేవి, పి.లక్ష్మి, దీక్ష చేపట్టారు.

తాళ్లరేవు స్థానికంగా జరు గుతున్న నిరసన శిబిరంలో అంగన్‌వాడీలు సత్యాగ్రహ దీక్షను చేపట్టారు. వీరి దీక్షకు సిపిఎం, టిడిపి, జనసేన పార్టీ నాయకులు టేకుమూడి ఈశ్వరరావు, టేకుమూడి లక్ష్మణరావు, ఉంగరాల బూరిబాబు, అత్తిలి బాబురావు, సుందరపల్లి సత్యనా రాయణ, దుప్పి అదృష్టదీపుడు, మందనక్క తణుకురాజు మద్దతుగా మాట్లాడారు. కరప స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద జరుగుతున్న నిరసన శిబిరం నుంచి పిహెచ్‌సి ఎదురుగా ఉన్న డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం వరకూ అంగన్‌వాడీలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అంబేద్కర్‌ విగ్రహానికి అందించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు పి.వీరవేణి, ఎస్‌.వరలక్ష్మి, ఎస్‌ఎస్‌.కుమారి, దైవకుమారి, అచ్చారత్నం, కల్పలత, తదితరులు పాల్గొన్నారు.

పెద్దాపురం స్థానిక మున్సిపల్‌ సెంటర్‌లో నిర్వహిస్తున్న సమ్మె శిబిరం వద్ద ఉన్న అంబేద్కర్‌ విగ్రహం ఎదురుగా అంగన్‌వాడీలు సత్యాగ్రహం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ యూనియన్‌ కార్యదర్శి దాడి.బేబీ మాట్లాడుతూ డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ మహిళల కోసం, మహిళల సమానత్వం కోసం రాజ్యాంగంలో అనేక హక్కులు కల్పించారన్నారు. అటువంటి మహానుభావుడి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న సిఎం జగన్మోహన్‌ రెడ్డి తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న మహిళలకు న్యాయం చేయడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు క్రాంతికుమార్‌, గడిగట్ల సత్తిబాబు, టి.నాగమణి, అమలావతి, టిఎల్‌.పద్మావతి, తదితరులు పాల్గొన్నారు.

ఏలేశ్వరం స్థానికంగా జరుగుతున్న నిరసన శిబిరంలో తమ డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ అంగన్‌వాడీలు పొర్లు దండాలు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సెక్టార్‌ అధ్యక్షురాలు కాకరపల్లి సునీత, ఎన్‌ అమలావతి, సిహెచ్‌.వెంకటలక్ష్మి, జె.రాణి, పి.నూకరత్నం, ఆర్‌.రత్నకుమారి, పి.దుర్గాసూర్యకుమారి, కె.రమ్య, పి గంగాభవాని, కె.బంగారు పాప, బి.కృపావతి పాల్గొన్నారు.

పిఠాపురం స్థానిక తహశీల్ధార్‌ కార్యాలయం వద్ద సమ్మె శిబిరంలో అంగన్‌వాడీలు నిరసనను కొనసాగించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు డి.పద్మావతి, ప్రాజెక్ట్‌ అధ్యక్షురాలు తులసి మాట్లాడుతూ 37 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు విజయశాంత, వి.వెంకటలక్ష్మి, నళిని, ప్రజావాణి, బి వెంకటలక్ష్మి, రామలక్ష్మి, అమల, రాఘవమ్మ, సత్యవతి ప్రభ, రామ తులసి పాల్గొన్నారు.

➡️