టిడిపితోనే భవిష్యత్తుకు గ్యారెంటీ : గూడూరి

ప్రజాశక్తి-పెద్దదోర్నాల : టిడిపితోనే ప్రజల భవిష్యత్‌ గ్యారెంటీ సాధ్యమని టిడిపి నియోజక వర్గ ఇన్‌ఛార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు తెలిపారు. మండలంలోని కొత్తూరు గ్రామంలో బాబు షూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం మంగళవారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ మహిళలకు టీడీపీ ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టోలోని అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్‌ ఏరువ మల్లి కార్జునరెడ్డి, నాయకులు సుధాకర్‌రెడ్డి, మాబు, శేషాద్రి, బాబు, శ్రీనివాసులు , టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

➡️