టిడిపితోనే రాష్ట్రాభివృద్ధి : ఎమ్మెల్యే

ప్రజాశక్తి-పొన్నలూరు : టిడిపితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని కొండపి ఎమ్మెల్యే డాక్టర్‌ డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి తెలిపారు. మండల పరిధిలోని మేకపాడు గ్రామంలో తెలుగు యువత నాయకులు కాటూరి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మాజీ సర్పంచి కాటూరి వెంకటేశ్వర్లు,ఉప సర్పంచ్‌ పాపినేని ప్రసాద్‌, కాటూరి సుబ్బారావు, కాటూరి లక్ష్మీ నారాయణ, కాటూరి వెంకటేశ్వర్లు, కాటూరి గురవయ్య, కాటూరి ప్రసాద్‌, కాటూరి మాల్యాద్రి శనివారం టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా దామచర్ల సత్య మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునే అదష్టం దామచర్ల కుటుంబానికి కల్పించిన ప్రజలందరికీ కతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి పరిశీలకులు భేరి పుల్లారెడ్డి, టిడిపి మండల అధ్యక్షులు అనుమోలు సాంబశివరావు, మాజీ అధ్యక్షుడు మండవ ప్రసాద్‌, నాయకులు కర్ణా కోటిరెడ్డి, పిల్లి వెంకట నారాయణరెడ్డి, సన్నమూరి నరసింహారావు, కాటూరి మాధవరావు, ఉన్నం బసవయ్య తదితరులు పాల్గొన్నారు.

➡️