టిడిపిలోకి కొనసాగుతున్న వలసలు

ప్రజాశక్తి-వెలిగండ్ల: వెలిగండ్ల మండలం బొంతగుంటపల్లి ఎస్సీ కాలనీలోని మొత్తం 55 కుటుంబాలు మూకుమ్మడిగా వైసీపీ నుంచి టిడిపిలోకి చేరారు. వీరిని నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. దీంతో ఎస్సీ కాలనీలోని అన్ని కుటుంబాలు టిడిపికి రావడంతో వారికి ధన్యవాదాలు తెలిపారు. బద్దిపూడి వెంగయ్య, కంచర్ల జయరావు, కంచర్ల ఆదాం, వేశపోగు రామయ్య, యేసేపు వెలుగొండయ్యలతో పాటు మొత్తం కాలనీలోని 55 కుటుంబాలు వైసీపీ నుంచి టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన పార్టీ టిడిపి అని, ప్రజలతో ఉండిపని చేసే పార్టీ టిడిపి అని, వైసీపీ వచ్చాక ఉద్యోగ అవకాశాలు కోల్పోయార న్నారు. ఎస్సీలకు తీవ్ర అన్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్‌రెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో టిడిపి ఎస్సీలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కావాలంటే ప్రజలు మరోసారి తప్పు చేయకుండా తెలుగుదేశం పార్టీని ఆదరించాలన్నారు.వరుసగా వలసలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభ, జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం సభ కనిగిరిలో విజయవంతం కావడం టిడిపి శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపింది. చంద్రబాబు నాయుడు నియోజక వర్గానికి ఉగ్ర ప్రతిపాదించిన ఐదు గ్యారెంటీల హామీ ఇవ్వడంతో కనిగిరి నియోజకవర్గం శాశ్వతంగా అభివృద్ధి జరుగుతుందనే ప్రచారం నిర్వహిస్తూ ఉగ్ర తనదైన శైలిలో పావులు కదుపుతూ ముందుకు సాగుతున్నారు. దీంతో ఉగ్ర ఆధ్వర్యంలో వెలిగండ్ల మండలం నుంచి పిఎన్‌ వరం, గుమ్మల్ల కర్ర, పందువ, పూలిగుంట్ల పంచాయతీల నుంచి 40 కుటుంబాలు, వెలిగండ్ల పంచాయతీ నుంచి 20 కుటుంబాలు, మరపగుంట్ల నుంచి 20 కుటుంబాలు, గన్నవరం నుంచి 13 కుటుంబాలు, రామగోపాలపురం పంచాయతీ నుంచి సర్పంచితోపాటు మరికొన్ని కుటుంబాలు టిడిపిలో చేరాయి. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షుడు ముత్తిరెడ్డి వెంకటరెడ్డి, టిడిపి సీనియర్‌ నాయకులు దొడ్డ వెంకటసుబ్బారెడ్డి, మండల తెలుగు రైతు అధ్యక్షుడు కేలం ఇంద్రభూపాల్‌రెడ్డి, మండల తెలుగు యువత అధ్యక్షుడు కర్నాటి భాస్కరరెడ్డి, మండల రైతు అధ్యక్షుడు మీనిగ కాశయ్య, మండల క్లస్టర్‌ ఇన్‌ఛార్జి కారంపూడి వెంకటేశ్వర్లు, అక్కి శ్రీనివాసరెడ్డి, అక్కి రాజేంద్ర, కేలం చంద్రశేఖర్‌రెడ్డి, దేవండ్ల మాధవ, కేసరి రమణారెడ్డి, తీట్ల చెన్నలక్ష్మి, తమ్మనేని పెద్దిరెడ్డి, మాజీ ఎంపీటీసీ కర్నాటి వెంకటేశ్వరరెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు ముత్తుమాల మహేష్‌రెడ్డి, కొండ్రు విజయభాస్కర్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ మాజీ కో ఆప్షన్‌ సభ్యులు షేక్‌ షరీఫ్‌, టి సుబ్రమహ్మణ్యం, కొండ్రు శ్రీనివాసరెడ్డి, పాతకోట వెంకటరెడ్డి, టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు. దళితులపై వైసిపి దాడులు: డాక్టర్‌ ఉగ్ర కనిగిరి: దళితులపై దాడులు చేసి డోర్‌ డెలివరీ చేసే సంస్కృతిని వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌ఛార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో పీసీ పల్లి మండలం పాత ముద్దపాడుకు చెందిన 15 దళిత కుటుంబాలు టీడీపీలో చేరాయి. డాక్టర్‌ ఉగ్ర మాట్లాడుతూ దళితులకు న్యాయం చేసింది, చేసేది ఒక్క తెలుగుదేశం పార్టీయేనని అన్నారు. నేడు రాష్ట్రంలో కోటీ 14 లక్షల మంది డ్వాక్రా మహిళలుంటే వారిని 79 లక్షలకే కుదించారని అన్నారు. 35 లక్షల మందికి మొండిచేయి చూపించారన్నారు. పిన్నమ్మ తాళి తెంచిన నరహంతకులను రక్షిస్తున్న జగన్‌రెడ్డి మహిళా ద్రోహి కాదా? అని ప్రశ్నించారు. చెల్లికి ఆస్తిలో భాగం ఇవ్వని జగన్‌రెడ్డి ప్రజలకు ఏమి న్యాయం చేస్తాడని విమర్శించారు.

➡️