టిడిపిలో ఆగని నిరసన జ్వాల

Feb 27,2024 21:14

టిడిపి జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే జాబితా విడుదల చేసిన తరువాత పార్టీలో అసమ్మతి సెగలు భగ్గుమన్న విషయం తెలిసిందే. జాబితా ప్రకటించి ఐదు రోజులు కావస్తున్నప్పటికీ నిరసన జ్వాలలు తగ్గడం లేదు. ఇంకా తమ నాయకునికి టిక్కెట్టు ఇవ్వాలని నాయకులు, కార్యకర్తలు డిమాండ్‌ చేస్తూ ర్యాలీలు, నిరసనలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం శివరామకృష్ణకు గజపతినగరం ఎమ్మెల్యే టిక్కెట్టు ఇవ్వాలని మంగళవారం బొండపల్లి మండల కేంద్రంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన ర్యాలీ చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే కెఎ నాయకుడకు టిక్కెట్టు ఇవ్వాలని కొంత మంది నాయకులు గజపతినగరం టిడిపి కార్యాలయంలో సమావేశమై డిమాండ్‌ చేశారు. మరో పక్క నెల్లిమర్ల టిడిపి ఇంచార్జి కర్రోతు బంగార్రాజుకు టిక్కెట్టు ఇవ్వాలని లేకపోతే సముచిత స్థానం కలిపంచాలని డిమాండ్‌ చేస్తూ టిడిపి నాయకులు డెంకాడలో సమావేశమయ్యారు. ఇదిలా ఉండగా గజపతినగరం ఎమ్మెల్యే అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్‌ను గెలిపించాలని తన తండ్రి, మాజీ ఎంపిపి కొండపల్లి కొండలరావు మంగళవారం గంట్యాడ మండలంలో పలు గ్రామాల్లో పర్యటించి కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు.

కరణం శివరామకృష్ణకు టికెట్‌ ప్రకటించాలి

ప్రజాశక్తి- బొండపల్లి

గజపతినగరం నియోజకవర్గం టిడిపి అభ్యర్థిగా కరణం శివరామకృష్ణ పేరును ప్రకటించాలని కోరుతూ మండల కేంద్రం వద్ద మంగళవారం టిడిపి కార్యకర్తలు నిరసన ర్యాలీ చేపట్టారు. వివిధ గ్రామాలకు చెందిన టిడిపి నాయకులు, కార్యకర్తలు శివరామకృష్ణకు మద్దతుగా ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కరణం శివరామకృష్ణకు ఎమ్మెల్యే టికెట్‌ వెంటనే ప్రకటించాలని, ఈ విషయంలో చంద్రబాబు పునరాలోచన చేయాలని నినాదాలు చేసారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి గొర్లె సత్యవతి, గ్రామ పార్టీ అద్యక్షులు పైల శ్రీనువాస రావు, సీనియర్‌ టిడిపి నాయకులు దాసరి శ్రీనువాసరావు, యడ్ల పైడిపునాయుడు, బొండపల్లి బుజ్జిబాబు, నక్కాన శివ కుమార్‌, తాళ్ళపూడి అప్పలనాయుడు, కొవ్వాడ బాలరాజు, చంద్రరావు, అప్పారావు, బూర లక్ష్మీ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.కెఎ నాయుడు సరైన అభ్యర్థిగజపతినగరం: స్థానిక పార్టీ కార్యాలయంలో మండల క్రియాశీలక కార్యకర్తల సమావేశం మంగళవారం నిర్వహించి మాజీ ఎమ్మెల్యే కెఎ నాయుడుకు ఎమ్మెల్యే టిక్కెట్టు కేటాయించాలని కోరారు. కెఎ నాయుడు మాత్రమే టిడిపికి సరైన అభ్యర్థి అని చెప్పారు. అధికారం ఉన్నా లేకున్నా కార్యకర్తలకు అండగా ఉన్నారని, ప్రతిపక్షంలో నాలుగేళ్ల పది నెలలు ప్రజా సమస్యలు పై పోరాటం చేసిన ఆయన్ను కాదని పలు పార్టీలు మారిన బొత్స అనుచరుడిగా ఉన్న కొండపల్లి శ్రీనివాస్‌ను అభ్యర్థిగా ప్రకటించడం పై పున్ణ పరిశీలన చేయాలనే తీర్మానాన్ని పార్టీ కార్యాలయానికి పంపిస్తున్నాం అని తెలిపారు. బొత్సకు దీటైన అభ్యర్థి కెఎ నాయుడు మాత్రమే అని కార్యకర్తలంతా ఆయనకు మద్దతుగా ఉన్నామని అన్నారు. ఈ సమావేశంలో 30 పంచాయితీల నుండి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.కర్రోతుకు సముచిత స్థానం కల్పించాలి డెంకాడ: టిడిపి నియోజకవర్గ ఇంఛార్జి కర్రోతు బంగార్రాజుకు ఎమ్మెల్యే టిక్కెట్టు అయినా ఇవ్వాలి లేదంటా సముచిత స్థానం కల్పించాలని డెంకాడ మండల నాయకులు కోరారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పొత్తులో భాగంగా జనసేనకి టికెట్‌ కేటాయించడం పై అధిష్ఠానం మళ్ళీ పునపరిశీలన చేసి కర్రోతుకు అవకాశం ఇవ్వాలన్నారు. దీనిపై అదిష్టానానికి వినతినిస్తామని అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎంపిపి కంది చంద్రశేఖర్‌, మాజీ జెడ్‌పిటిసి పతివాడ అప్పలనారాయణ, టిడిపి మండల అధ్యక్షులు పల్లె భాస్కర్‌ రావు, నాయకులు కలిదిండి పాణిరాజు, కాగితాల సత్యనారాయణ రెడ్డి, కొయనేని రమణ, కొర్నాన ఆదిబాబు, చిల్ల పద్మ, ముని పైడయ్య, చీకటి సుహాసిని, పడాల చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.శ్రీనివాస్‌ విజయానికి కృషి చేయాలిగంట్యాడ: రానున్న ఎన్నికలలో గజపతినగరం నియోజకవర్గ టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొండపల్లి శ్రీనివాస్‌రావుని ఎమ్మెల్యేగా గెలిపించాలని మాజీ ఎంపిపి కొండపల్లి కొండలరావు కోరారు. మంగళవారం నరవ మురపాక, గింజేరు, కొండతామరపల్లి గ్రామాలలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థి అయిన కొండపల్లి శ్రీనివాస్‌ని ఎమ్మెల్యేగా అందరూ కలిసికట్టుగా పనిచేసి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో నరవ మాజీ సర్పంచ్‌ సుంకరి రామనాయుడు, మండల జనసేన అధ్యక్షులు సారథి అప్పలరాజు, నందం మాజీ ఎంపిటిసి సంక్రాంతి పైడ్రాజు, వసాది మాజీ ఎంపిటిసి కల్లింపుడి జగన్నాథం, కాలే కృష్ణ, మోకాళ్లపాడు సర్పంచ్‌ బండారు సూర్యారావు, రాజధాని భవాని నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️