టిడిపిలో చేరికలు

Feb 2,2024 21:37
ఫొటో : పార్టీ కండువాలు కప్పుతున్న మాజీ ఎంఎల్‌ఎ బొల్లినేని వెంకటరామారావు

ఫొటో : పార్టీ కండువాలు కప్పుతున్న మాజీ ఎంఎల్‌ఎ బొల్లినేని వెంకటరామారావు
టిడిపిలో చేరికలు
ప్రజాశక్తి-సీతారామపురం : సీతారామపురానికి చెందిన ఆది చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ ఆదినారాయణరావు శుక్రవారం మాజీ జెడ్‌పిటిసి కలివెల జ్యోతి ఆధ్వర్యంలో మాజీ ఎంఎల్‌ఎ నియోజకవర్గం టిడిపి ఇన్‌ఛార్జ్‌ బొల్లినేని రామారావు సమక్షంలో టిడిపి కండువా కప్పుకున్నారు. వింజమూరు పట్టణంలో టిడిపి నిర్వహిస్తున్న ప్రజాదీవెన భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొని పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం ఆదినారాయణరావు మాట్లాడుతూ సీతారామపురం మండలంలో టిడిపి బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానన్నారు. రాబోయే ఎన్నికలలో బోల్లినేని రామారావును శాసనసభ్యుడిగా భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఆయనతోపాటు సోంపల్లి యూత్‌ ప్రెసిడెంట్‌ గొల్లపల్లి సుధాకర్‌, వినోద్‌, సురేష్‌, అఖిల్‌, సురేష్‌, మల్లికార్జున తెలుగుదేశం పార్టీలో చేరారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు వికాస్‌హరికృష్ణ, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

➡️