టిడిపిలో చేరికలు

Mar 20,2024 22:04
ఫొటో : కండువా కప్పుతున్న కావ్య క్రిష్ణారెడ్డి

ఫొటో : కండువా కప్పుతున్న కావ్య క్రిష్ణారెడ్డి
టిడిపిలో చేరికలు
ప్రజాశక్తి-కావలి : కావలి పట్టణంలోని 29వ వార్డు మాజీ వైసిపి కౌన్సిలర్‌ సురే మదన్‌మోహన్‌ రెడ్డి వైసిపిని వీడి బుధవారం టిడిపి పార్టీలో చేరారు. మదన్‌ మోహన్‌ రెడ్డితో పాటు 29వ వార్డు వైసిపి కీలక నేతలు వింతా కృష్ణారెడ్డి, శారద కూడా టిడిపిలో చేరారు. వీరికి కావలి నియోజకవర్గ టిడిపి అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి టిడిపి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానని వారికి హామీ ఇచ్చారు. కీలక నేతలు వైసిపిని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడంతో 29వ వార్డులో వైసిపికి గట్టి షాక్‌ తగిలింది.టిడిపిలో చేరిన ‘మెట్టుకూరి’రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ బోర్డ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మెట్టుకూరి చిరంజీవి రెడ్డి సోదరుడు మెట్టుకూరి అమరజీవి రెడ్డి వైసిపిని వీడి టిడిపిలో చేరారు. మాజీ ఎంపిటిసి, మాజీ సర్పంచ్‌గా పనిచేసిన ఆయన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. కావలి నియోజకవర్గ టిడిపి అసెంబ్లీ అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి అమరజీవి రెడ్డికి టిడిపి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని క్రిష్ణారెడ్డి హామీనిచ్చారు.

➡️