ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తా

Jun 28,2024 19:44
ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తా'

మాట్లాడుతున్న మాజీ మంత్రి కాకాణి”ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తా”ప్రజాశక్తి-నెల్లూరు:రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చిందని, తమపై దాడులు, వేధింపులు చోటు చేసుకుంటాయని వైసిపి నాయకులు, కార్యకర్తలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కరికీ పార్టీ, తాను అండగా నిలుస్తామని మాజీ మంత్రి కాకాణి గోర్థన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. శుక్రవారం ఆయన సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండల వైసిపి కార్యాలయంలో ఆపార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలనుద్ధేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు పాలన అభివృద్ధి, సంక్షేమంతో కాకుండా విభిన్నంగా విధ్వంస కాండతో ప్రారంభించారన్నారు. ఆధిపత్యం కోసం వైసిపి నాయకులపై, వారి ఆస్తులపై తెలుగుదేశం నాయకులు దాడులకు తెగబడుతున్నారన్నారు. రాష్ట్రంలో పార్టీలు అన్ని ఏకమైన జగన్మోహన్‌ రెడ్డి ఒక్కరికే ఎన్నికల సంగ్రామంలో పోటీ చేస్తే 40శాతం ఓటు శాతాన్ని ప్రజలు అందించారన్నారు. ప్రజలకు అండదండలు అందించడమే ప్రధాన ధ్యేయంగా పార్టీ అడుగులు వేస్తుందన్నారు. తమ ప్రభుత్వ హాయాంలో సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతి మండలం, ప్రతి గ్రామం, ప్రతి వాడ, ప్రతి వీధి అభివృద్ధి చేశామన్నారు. రైతులకు, సామాన్యులకు అందుబాటులో ఉండి, అండగా నిలిచి, అండదండలు అందించామన్నారు. సర్వేపల్లి ప్రజలకు అధికారంలో ఉన్నా, లేకపోయినా మీ ఇంటిబిడ్డగా అండగా నిలుస్తామన్నారు.తెలుగుదేశం పార్టీ చోటా నాయకుల ఉడత బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదన్నారు.

➡️