టిడిపిలో చేరిక

ప్రజాశక్తి -కనిగిరి : మండల పరిధిలోని రాగిమానిపల్లికి చెందిన 25 కుటుంబాల వారు సోమవారం టిడిపిలో చేశారు. టిడిపి కనిగిరి నియోజక వర్గ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి వారికి కండవాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అదేవిధంగా పిసిపల్లి మండలం బట్టుపల్లి సర్పంచి డబ్బుకొట్టు రవీంద్ర, సచివాలయ కన్వీనర్‌ డబ్బుకొట్టు వెంకట్రావు, మాజీ సర్పంచి ఊసా మాల్యాద్రి, వెంకట రత్తయ్యతో 50 కుటుంబాల వారు టిడిపిలో చేరారు. డాక్టర్‌ ఉగ్ర వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా కనిగిరి మండలం లింగారెడ్డిపల్లికి చెందిన 20 కుటుంబాల వారు టిడిపిలో చేరారు. మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహాన్వించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️