టిడిపిలో 50 కుటుంబాలు చేరిక

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: యర్రగొండపాలెంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం యర్రగొండపాలేనికి చెందిన 50 వైసీపీ కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలో చేరారు. వైసీపీ సీనియర్‌ నాయకులు ఒంగోలు ఆదిరెడ్డి, కాయకాకుల సుబ్బయ్య, ఎంపిటిసి కాయకాకుల సత్యవతి ఆధ్వర్యంలో 50 కుటుంబాల వారు చేరారు. ఈ సందర్భంగా టిడిపి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబు వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ కండువాలు కప్పి అక్కున చేర్చుకున్నారు. ఈ సందర్భంగా ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. తాము నియోజకవర్గంలోని ఏ గ్రామానికి వెళ్లినా వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని తెలిపారు. ప్రజలు భ్రహ్మరథం పడుతున్నట్లు చెప్పారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంలో గెలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్‌ చేకూరి సుబ్బారావు, నాయకులు కామేపల్లి వెంకటేశ్వర్లు, చిట్టేల వెంగళరెడ్డి, పాలడుగు వెంకట కోటయ్య, షేక్షావలి, మస్తాన్‌వలి, కొత్త భాస్కర్‌, కిశోర్‌, చెవుల అంజయ్య, రవణమ్మ, మంత్రు నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️