టిడిపి అధినేతతో ‘ముత్తుముల’ భేటీ

ప్రజాశక్తి-గిద్దలూరు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుని గిద్దలూరు టీడీపీ ఇన్‌ఛార్జి ముత్తుముల అశోక్‌రెడ్డి శనివారం మధ్యాహ్నం మర్యాదపూర్వకంగా కలిశారు. మిచౌంగ్‌ తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు బాపట్ల పార్లమెంట్‌లో పర్యటిస్తున్న చంద్రబాబుని జడ్పీటీసీ బుడతా మధుసూదన్‌ యాదవ్‌, మాజీ సర్పంచ్‌ చెన్నబోయిన రామకృష్ణ యాదవ్‌లతో సహా ముత్తుముల అశోక్‌రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు అంశాలపై ఆయన చర్చించారు. జగన్‌ అరాచక పాలనను వ్యతిరేకిస్తూ వైసీపీని వీడి టీడీపీలో చేరిన జడ్పీటీసీ, మాజీ సర్పంచ్‌లను ఈ సందర్భంగా చంద్రబాబు అభినందించారు. వారికి రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని, పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. నియోజకవర్గంలో అశోక్‌ రెడ్డి గెలుపు కోసం కష్టపడి పని చేయాలని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు కావటం ఖాయమని అన్నారు.

➡️