టిడిపి ఆధ్వర్యంలో పదో విడత పోరుబాట

ప్రజాశక్తి-భట్టిప్రోలు: భట్టిప్రోలు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం 10వ విడత పోరుబాట కార్యక్రమం నిర్వహిం చారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా ఆధ్వర్యంలో భట్టిప్రోలులోని జగనన్న కాలనీలో జరిగిన పోరుబాట కార్యక్రమంలో సాయిబాబా మాట్లాడు తూ భట్టిప్రోలులో సుమారు 34 ఎకరాల భూమిని కొనుగో లు చేసి దాదాపు 1174కు పైగా పట్టాలను మంజూరు చేసినప్పటికీ దానిలో కనీస మౌలిక వస్తువులు లేకపోవడం తో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిలో రెండెకరాల భూమి కోర్టులో ఉండగా 104 మందికి తాత్కాలిక పట్టాలు మంజూరు చేసి భూమిని చూపించకుండా అలాగే మిగిల్చారు. మిగిలిన భూమిలో పట్టాలు పొందిన వారు 1,070 మంది ఉన్నారు. వీరిలో 350 గృహాలు రద్దు అయ్యాయన్నారు. దీనికి కారణం ప్రభుత్వం ముందుగానే స్థలంతో పాటు గృహాన్ని నిర్మించేస్తామని చెప్పటంతో లబ్ధిదారులు ఆశపడ్డారు. దీని కారణంగా గృహాలు నిర్మించుకోలేకపోవడంతో మంజూరును తాత్కాలికంగా నిలిపివేశారన్నారు. కాగా మిగిలిన 713 మందికి గాను 440 గృహాలు బేసిమెంట్‌ స్థాయిలో నిలిచిపోగా 19 గృహాలు మాత్రం పూర్తి చేసుకున్నాయి. కానీ వీరు కూడా గృహప్రవేశాలు చేసుకోలేకపోయారన్నారు. దీని ద్వారా 5 శాతం గృహాలు కూడా పూర్తికాని పరిస్థితి నెలకొందని అన్నారు. ఓ పక్క ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, మరొకపక్క మంత్రి నాగార్జున, ప్రస్తుతం వరికూటి అశోకబాబులు కనీసం గృహ నిర్మాణాలు చేపట్టకపోగా కనీసం మౌలిక సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదని అన్నారు. భట్టిప్రోలు జగనన్న కాలనీలో ఒక రోడ్డు గానీ, తాగునీటి సౌకర్యం గాని, మురుగునీరు పారుదల కావడానికి డ్రైనేజీ వ్యవస్థ గాని నిర్మించిన దాఖలాలు లేవని, ఎలాంటి వసతులు లేకుండా లబ్ధిదారులు ఏ విధంగా గృహాలు నిర్మించుకుంటారని ఆయన ప్రశ్నించారు.నాయకులే కాంట్రాక్టర్లు దీనిలో అధికార పార్టీకి చెందిన నాయకులు కాంట్రాక్టర్లుగా అవతారం ఎత్తడంతో తీవ్రంగా అవినీతి జరిగిందని ఆరోపించారు. గృహ నిర్మాణాలు చేపడతామని ఒక్కొక్కరు 100 నుంచి 150 గృహాలు చొప్పున ఇద్దరు వ్యక్తులు కాంట్రాక్టు తీసుకుని దానిలో వాడాల్సిన మెటీరియల్‌ నిబంధనలకు విరుద్ధంగా వినియోగించి సొమ్ము చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గృహ నిర్మాణానికి పిల్లర్స్‌లో 10 ఎంఎం ఇనుముకు బదులు 8 ఎంఎం ఇనుము వినియోగించి తక్కువ నాసిరకం సిమెంటుతో ఒక్కో కట్టకు వినియోగించాల్సిన మోతాదు కంటే తక్కువ మోతాదు వినియోగించి లబ్ధిదారులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే గృహ నిర్మాణ శాఖ నిబంధనల ప్రకారం పది అడుగుల లోతు బోర్లు తీయాల్సి ఉండగా అందుకు భిన్నంగా ఆరు నుంచి ఏడు అడుగులు మాత్రమే బోర్లు తవ్వి దానిలో ఇనుమును మిగిల్చుకుని కక్కుర్తికి పాల్పడ్డారని దీని కారణంగా పది కాలాలపాటు 10 కాలాలపాటు పదిలంగా ఉండాల్సిన గృహాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్‌రెడ్డి పాలల్లో జరిగిన అవినీతి, అక్రమాలు, అభివృద్ధి నిరోధక చర్యలను ప్రజల దృష్టికి తీసుకురావాలని ఉద్దేశంతో ఇప్పటివరకు ఆయా ప్రాంతాల్లో పది విడతలు పోరు బాట కార్యక్రమం చేపట్టడం జరిగిందని సాయిబాబా తెలిపారు. ఈయన వెంట నాయకులు బట్టు మల్లికార్జునరావు, కనపర్తి సుందర్రావు, ఎడ్ల జయసిలరావు తదితరులు ఉన్నారు.

➡️