టిడిపి జెండా ఆవిష్కరణ

హనుమంతునిపాడు : హనుమంతునిపాడు మండలం నందనవనం గ్రామపంచాయ పరిధిలోని పాపిరెడ్డి పల్లి ఎస్‌సి కాలనీలో టిడిపి జెండాను శుక్రవారం ఆవిష్కరించారు. టిడిపి మండల అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ టిడిపి కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గాయం రామిరెడ్డి, చీకటి వెంకటసుబ్బయ్య, ఎంపిటిసి ఉడుముల సుబ్బారెడ్డి,పెంచగల రామకష్ణ, రావినూతల కిషోర్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️