టిడిపి టిక్కెట్‌ ఎవరికో?

Jan 25,2024 21:08

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం :   త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ కురుపాం నియోజకవర్గంలో టిడిపి టికెట్‌ ఎవరికనే చర్చ ప్రతి ఊరూ వాడ జరుగుతోంది. గత పదేళ్లుగా నియోజకవర్గంలో టిడిపికి సరైన అభ్యర్థి లేకపోవడం తో వైసిపి తన మెజార్టీ నిరూపించుకుంది. ఈసారైనా టిడిపి మంచి అభ్యర్థిని నిలబెట్టి గెలుపు కోసం పార్టీ అధిష్టానం వ్యూహా రచన చేస్తుంది. అయితే టిడిపిలో ఎమ్మెల్యే టిక్కెట్‌ కోసం పోటీపడుతున్న వారీ సంఖ్య రోజురోజుకు పెరుగుతూ కనిపిస్తుంది. అయితే పోటీపడుతున్న వారిలో ఎవరికి టిక్కెట్‌ కేటాయిం చాలనే అనేదానిపై పార్టీ అధిష్టానం అంతర్గత సర్వే నిర్వహిస్తుంది. అయితే ఇందులో ఎక్కువ శాతం మొదటి నుంచి పార్టీకి కష్టపడుతున్న టిడిపి ఇన్‌ఛార్జి తోయక జగదీశ్వరి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇన్చార్జి పదవి అప్పగించినప్పటి నుంచి నేటి వరకు క్రమశిక్షణతో పార్టీ అభివృద్ధి కోసం 25 నెలల పాటు శక్తి వంచన లేకుండా పనిచేస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే మరోవైపు రెండో వర్గానికి చెంది న బిడ్డిక పద్మా వతి, పువ్వల లావణ్య కూడా ఎమ్మెల్యే టికెట్‌ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు రిటైర్డ్‌ ఉపాధ్యా యులు, ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షులు నందివాడ కృష్ణబాబు కూడా టిడిపి టిక్కెట్‌ కోసం మొదటి నుంచి గట్టిగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. చివరి నిమిషంలో వచ్చిన కురుపాంకు చెందిన మాజీ ఎంపి ప్రదీప్‌దేవ్‌ కుమారుడు వీరేష్‌ చంద్ర దేవ్‌ కూడా ఎంపి లేదా ఎమ్మెల్యే టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. దీంతో ఎవరికి వారు చాపకింద నీరులా పార్టీ టికెట్‌ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. గత రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన పాముల పుష్ప శ్రీవాణిని ఎన్నికల్లో ఢకొీట్టాలంటే సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్న, ప్రజాదరణ పొందివున్న అభ్యర్థి కోసం టిడిపి సర్వేలు తీవ్రతరం చేసింది. టిడిపిని వేధిస్తున్న గ్రూపు రాజకీయాలుఇదిలా ఉండగా నియోజకవర్గం టిడిపిని గ్రూపు రాజకీయాలు వేధిస్తున్నాయి. ఈ సమస్య వైసిపిలో కనిపించడం లేదు. ఇది ఒక విధంగా వైసీపీకి ప్లస్‌ పాయింట్‌గా చెప్పవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో నిజమైన గిరిజన అభ్యర్థికి టిక్కెట్‌ కేటాయించాలనే గిరిజన నినాదం ఉన్నా ఆ నినాదం ఏ మేరకు పనిచేస్తుందో వేచి చూడాలి. చివరి నిమిషం వరకు ఎమ్మెల్యే టికెట్‌ ఎవరికి కేటాయిస్తారోనని ప్రజల్లోనూ, ఆశావాహుల్లో తీవ్ర ఉత్కంఠ కనబడుతుంది. 2024 ఎన్నికలు కురుపాం నియోజకవర్గంలో హీట్‌ ఎక్కనున్నాయి.

➡️