టిడిపి నాయకురాలు మృతికి నివాళి

ప్రజాశక్తి-వేమూరు: వేమూరు నియోజకవర్గం జంపని గ్రామానికి చెందిన నన్నే పాగా విక్టర్‌ కుమార్తె అనూష(25) అనారోగ్యంతో మృతిచెందగా బుధవారం మాజీ మంత్రి, టిడిపి పోలిట్‌బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు బాధిత కుటుంబాన్ని పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. అలాగే చుండూరు మండలం పెద్దగాదెలవరు, గ్రామానికి చెందిన టిడిపి నాయకులు మామిళ్లపల్లి వెంకట్రావు తల్లి వెంకటసుబ్బమ్మ అనారోగ్యంతో మృతిచెందగా ఆమె పార్థివ దేహానికి పూలమాలవేసి ఆనందబాబు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వేమూరు చుండూరు మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

➡️