టిడిపి ఫ్లెక్సీలు చించివేత

టంగుటూరు : టంగుటూరులో నిజం గెలవాలి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక టోల్‌ ప్లాజా వద్ద టీడీపీ నాయకులు నారా భువనేశ్వరి స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలను గుర్తుతెలియని కొందరు వ్యక్తులు చించి వేశారు. బుధవారం 12 గంటల సమయంలో టోల్‌ ప్లాజా వద్దకు చేరుకున్న టిడిపి నాయకులు ఈ చర్యను చూసి అవాక్కయ్యారు. టోల్‌ ప్లాజా సిబ్బందిని కలిసి మీ అనుమతితోనే తామ ప్లెక్సీలు ఏర్పాటు చేశామని, ఇంతలోనే ఫ్లెక్సీలు చించివేసింది ఎవరని ప్రశ్నించారు. దీంతో టిడిపి నాయకులు కామని నాగశ్రీను, పోకూరి రవీంద్రబాబు, టోల్‌ ప్లాజా సిబ్బంది మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. టోల్‌ ప్లాజా వద్ద ఉన్న సిసి పుటేజీలను పరిశీలించాలని టిడిపి నాయకులు పట్టుబట్టారు. ఈ ఘటనకు పాల్పడింది ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని వారు హెచ్చరించారు. అధికార పార్టీ మంత్రి అండతోనే స్థానిక వైసిపి నాయకులు ఈ దుశ్చర్యకు తెగబడ్డారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. టోల్‌ ప్లాజా వద్దకు భారీగా చేరుకున్న టిడిపి నాయకుల ఆగ్రహంతో అక్కడ కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వాస్తవాలను పరిశీలించి దీనికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని

➡️