టిడ్కో ఇళ్ల విద్యుద్దీకరణ పనులు ప్రారంభం

Jan 25,2024 21:05

ప్రజాశక్తి – సాలూరు : పట్టణానికి సమీపంలో నిర్మాణమైన టిడ్కో ఇళ్లకు విద్యుదీకరణ పనులను గురువారం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పువ్వుల ఈశ్వరమ్మ ప్రారంభించారు. 26 బ్లాక్‌లకు సంబంధించి రూ.3కోట్లుతో చేపట్టనున్న విద్యుద్దీకరణ పనులకు భూమిపూజ చేశారు. వైస్‌ చైర్మన్లు జర్జాపు దీప్తి, వంగపండు అప్పలనాయుడు, జెసిఎస్‌ కన్వీనర్‌ గిరిరఘు, అర్బన్‌ బ్యాంక్‌ అధ్యక్షులు జర్జాపు ఈశ్వరరావు, కౌన్సిలర్లు రాపాక మాధవరావు, పప్పల లక్ష్మణరావు, గొర్లి వెంకటరమణ, డిసిఎంఎస్‌ డైరెక్టర్‌ పిరిడి రామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ టిడ్కో ఇళ్ల పంపిణీ ఫిబ్రవరి మొదటి వారంలో జరగనున్న నేపథ్యంలో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ జయరాం టి.జయరాం, టిడ్కో ఇఇ జ్యోతి, విద్యుత్‌ (నిర్మాణ విభాగం), డిఇ త్రినాథరావు, ఎడిఇ వి.రంగారావు పాల్గొన్నారు.

➡️