టీడీపీలోకి 60 కుటుంబాలు

ప్రజాశక్తి-గిద్దలూరు: తెలుగుదేశం పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి ఇన్‌ఛార్జి ముత్తుముల అశోక్‌రెడ్డి సమక్షంలో అర్ధవీడు మండలం, పెద్ద కందుకూరు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు, మాజీ సర్పంచ్‌ చేగిరెడ్డి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన 60 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలోకి చేరాయి. ఈ సందర్భంగా అశోక్‌రెడ్డి వారికీ టిడిపి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైసిపిని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️