టెన్త్‌ విద్యార్థిని ఆత్మహత్య

Mar 14,2024 22:04

ప్రజాశక్తి-బొబ్బిలి : పదో తరగతి పరీక్షలకు బాగా చదవాలని తల్లిదండ్రులు మందలిం చడంతో మనస్థాపం చెందిన విద్యార్థిని గెద్ద మానస ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మండలంలోని అలజంగి గ్రామానికి చెందిన మానస పదో తరగతి చదువుతుంది. పరీక్షలు దగ్గర పడడంతో బాగా చదవాలని తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన బాలిక బుధవారం రాత్రి ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తెల్లవారి నిద్రలేచిసరికి కుమార్తె విగతజీవిగా వేలాడుతూ కనిపించడంతో తల్లిదండ్రులు అరుణకుమారి, శంకరరావు బోరున విలపించారు. మానసకు తమ్ముడు ఆదర్శ్‌ ఉన్నాడు. విద్యార్థిని మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎస్‌ఐ చదలవాడ సత్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

➡️