ట్యాబ్‌లను వినియోగించాలి: డిఇఒ

Feb 23,2024 21:25

ప్రజాశక్తి- చీపురుపల్లి: బైజూస్‌ విషయ పరిజ్ఞానంలో 8,9 తరగతుల విద్యార్ధులు తప్పనిసరిగా టాబ్‌లను వినియోగించాలని జిల్లా విధ్యాశాఖాధికారి ఎన్‌ ప్రేమ్‌కుమార్‌ సూచించారు. శుక్రవారం చీపురుపల్లి మేజర్‌ పంచాయతీ పరిధిలోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వం అందజేసిన ట్యాబ్‌లను ప్రతీ విద్యార్ధి పాఠశాలకు తీసుకు వచ్చే విధంగా చూడాలన్నారు. ఐఎఫ్‌పిలను ఉపయోగించి విద్యార్ధులకు బోధన చేయాలని ఉపాద్యాయులకు సూచించారు. పిఎఎల్‌ లేబ్‌ని సద్వినియోగం చేసుకొని విద్యార్ధులకు బోధన చేయాలని ఆదేశించారు. పాఠశాలలో మద్యాహ్న భోజన పథకంలో భాగంగా జగనన్న గోరుముద్ద మెనూ ప్రకారం అందుతున్నదీ లేనిదీ ఆరా తీశారు. అనంతరం మండలంలో గల విజయరాంపురం ప్రాథమిక పాఠశాలను ఆయన సందర్శించారు. అక్కడ చదువుకుంటున్న విధ్యార్ధుల విద్యా సామర్థ్యాలను పరిశీలించారు. వర్క్‌ బుక్స్‌ను విద్యార్ధులు రాసిన తరువాత ప్రతీ పేజీని ఉపాధ్యాయలు పరిశీలించి తప్పులుంటే సరిచేసి రిమార్క్‌ రాసిసంతకం చేయాలని సూచించారు. 1వ తరగతి చదువు విద్యార్ధుల తల్లిదండ్రులు ఫోన్‌ నెంబర్లతో డిజి లాకర్‌ని ఓపెన్‌ చేసి ఎఫ్‌ఏ-3 మార్క్సను అందులో ఉండే విధంగా చూడాలని ఉపాద్యాయులకు సూచించారు. డిఇఒ వెంట ఎంఇఒ బూసినాయుడు, డిసిఇ బోర్డు సెక్రటరీ సన్యాసిరాజు, సిఆర్‌ఎంటి కంది రామకృష్ణ తదితరులున్నారు.

➡️