ట్యాబ్‌లను సద్వినియోగం చేసుకోవాలి

ప్రజాశక్తి – చాపాడుట్యాబ్‌లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎంఇఒలు రవిశంకర్‌, వంశీకృష్ణ తెలిపారు. కస్తూరిబా పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు గురువారం ఎంఇఒలు, సర్పంచ్‌ మహబూబ్‌బీ పంపిణీ చేశారు. అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ట్యాబ్‌ల పంపిణీపై విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్‌ నాగలక్ష్మి , ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ముద్దనూరు : మండలంలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో గురువారం విద్యార్థులకు ట్యాబులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపిపి-1 పాలగిరి రేణుక, ఎంఇఒలు నాగేశ్వర్‌ నాయక్‌, సుబ్బారావు, ప్రధానోపాధ్యాయులు రాజబాబు, శ్రీనివాసులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.చక్రాయపేట : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు మండల వ్యాప్తంగా ఇన్‌ఛార్జి వైయస్‌ కొండారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండలంలోని నాగలగట్టుపల్లె, మహాదేవపల్లె, చిలేకంపల్లి, చక్రాయిపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేశారు. ఎంపిపి మాధవి బాలకృష్ణ, బ్రాహ్మణ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ ప్రసాద్‌రావు, ఎంపీటీసీ మోహన్‌రెడ్డి, మహాదేవపల్లె జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవికుమార్‌, సర్పంచ్‌ శ్రీనివాసులు, ఎంఇఒ-2 రామ చంద్రారెడ్డి, స్కూల్‌ కమిటీ చైర్మన్‌ ఉత్తమరెడ్డి, జేసిఎస్‌ మండల ఇన్‌ఛార్జి లోమ డ రామాంజనేయరెడ్డి, మహదేవపల్లె స్కూల్‌ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.ఎర్రగుంట్ల : స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు బైజుస్‌ ట్యాబ్‌లను గురువారం పంపిణీ చేశారు. 168 మంది విద్యార్థులకు ట్యాబ్‌లను పంపిణీ చేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామాం జనేయులురెడ్డి తెలిపారు. మండల వ్యాప్తంగా మొత్తం 450 విద్యార్థులకుగానూ 170 ట్యాబ్‌లు ప్రభుత్వం నుండి అందాయని తెలిపారు. మిగిలినవి 2 రోజుల్లో పంపిణీ చేస్తామని ఎంఇఒ శివప్రసాద్‌ తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు చంద్రఓబుళరెడ్డి, ఈశ్వరయ్య పాల్గొన్నారు.వేంపల్లె : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసిం చాలని జడ్పీటీసీ రవికుమార్‌రెడ్డి అన్నారు. గురువారం వేంపల్లె జిల్లా పరిషత్‌ బాలురపాఠశాల, మహత్మా జ్యోతి బాపూలే పాఠశాలలో 8వ తరగతి విద్యా ర్థుల కు ట్యాబ్‌లను రవికుమార్‌రెడ్డి పంపిణీ చేశారు. ఉపాధ్యాయుడు రామ చంద్రా రడ్డి ఆధ్వర్యంలో కేక్‌ను కట్‌ చేశారు. ఎంఇఒ స్టాలిన్‌, ఎంపిపి లక్ష్మి గాయత్రి, ఎంపిటిసి భారతి, వార్డు మెంబరు ముత్యాల ఆంజనేయులు, పాల్గొన్నారు. సింహాద్రిపురం : సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక వైఎస్‌ఆర్‌ విగ్రహం వద్ద మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ రామమోహన్‌రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు బ్రహ్మానందరెడ్డి, మల్లికార్జున్‌ రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. విద్యార్థులకు వాటర్‌ బాటిళ్లు, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్డు, పండ్లు పంపిణీ చేశారు. నాయకులు రాష్ట్ర డైరెక్టర్‌ కిషోర్‌రెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, ద్వారకనాథ్‌రెడ్డి, నీలవర్ధన్‌రెడ్డి, ఎంపిటిసి జాఫర్‌, మధు పాల్గొన్నారు.

➡️