ట్రాఫిక్‌ పోలీసులకు రక్షణ పరికరాలు పంపిణీ

Nov 25,2023 21:14
ఫొటో : ట్రాఫిక్‌ పోలీసులకు పరికాలు అందజేస్తున్న దృశ్యం

ఫొటో : ట్రాఫిక్‌ పోలీసులకు పరికాలు అందజేస్తున్న దృశ్యం
ట్రాఫిక్‌ పోలీసులకు రక్షణ పరికరాలు పంపిణీ
ప్రజాశక్తి-కావలి : వాసవి క్లబ్‌ అధ్యక్షులు కర్నాటి సుబ్బారావు శనివారం ట్రాఫిక్‌ పోలీసులు పడుతున్న ఇబ్బందులు గమనించి మంచి ఆలోచనతో డిఎస్‌పి వెంకటరమణ రెయిన్‌ కోట్‌, తలకు టోపీ, టర్కీటవల్‌, పంపిణీ చేశారు. మంచి ఆలోచనతో ట్రాఫిక్‌ పోలీసులకు సోదరభావంతో సహకారాలు అందించిన కర్నాటి సుబ్బారావును డి.ఎస్‌.పి. వెంకటరమణ శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో 1వ పట్టణ సిఐ శ్రీనివాసరావు, 2వ పట్టన సిఐ సుధాకరరావు, పోలీస్‌ సిబ్బంది, డాక్టర్‌ పాదర్తి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

➡️