డంపింగ్‌ యార్డ్‌ తరలింపులో విఫలం

డంపింగ్‌ యార్డ్‌

వ్రైసిపి నేతలు, ప్రభుత్వం తీరుపై వీరు యాదవ్‌ ఆగ్రహం

ప్రజాశక్తి-అనకాపల్లి : పట్టణం నడిబొడ్డున ఉన్న డంపింగ్‌యార్డు తరలింపులో స్థానిక అధికారపార్టీ నేతలు, వైసిపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పాత్రపల్లి వీరు యాదవ్‌ ఆరోపించారు. ఆదివారం జివింఎసి జోనల్‌ కార్యాలయంలోని డంపింగ్‌యార్డు వద్ద ప్లకార్డులతో నిరసన చేపట్టారు.ఐదేళ్లుగా ధర్నాలు, నిరసనలు, దీక్షలు, ఫిర్యాదులు, వినతులిచ్చినా తమకేమీ పట్టనట్లు అనకాపల్లిని అందాలపల్లి చేస్తానన్న స్థానిక ఎమ్మెల్యే, మంత్రి గుడివాడ అమర్‌గానీ, స్థానిక ఎంపీ బివి.సత్యవతిగానీ ఇసుమంతైనా స్పందించకపోవడం విచారకరమన్నారు. విపక్షంలో ఉన్నపుడు ఎన్నో సవాళ్లు విసిరిన వైసిపి నేతలంతా అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లపాటు దీని ఊసెత్తలేదని, దీనికి తగిన ప్రతిఫలం తప్పదని హెచ్చరించారు.

నిరసన వ్యక్తం చేస్తున్న వీరు యాదవ్‌

➡️