డా.బాశెట్టి లతకు ”విద్యారత్న విశిష్ట సేవా రత్న” ప్రధానం

Jan 21,2024 16:32 #Kurnool

ప్రజాశక్తి-కర్నూలు కల్చరల్‌ : తెలుగు భాషా, సాహిత్య రంగాలలో కషి చేసినందుకు డా. బాశెట్టి లత ”విద్యారత్న విశిష్ట సేవారత్న” పురస్కారాన్ని తెలుగు అకాడమి చైర్మన్‌ నందమూరి లక్ష్మీ పార్వతి చేతుల మీదుగా అందుకొన్నారు. పుడమి సాహితీ వేదిక, నల్గొండ, తెలంగాణ ఆధ్వర్యంలో ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డా. భాశెట్టి లతకు ముద్రిక కళాస్రవంతి అధ్యక్షులు ముద్రిక భాస్కర్‌, సాహితీ స్రవంతి నాయకులు రచయితలు కెంగార మోహన్‌, కవులు మారేడు రాముడు తోపుదుర్తి వెంకట్రాం, పసుపులేటి నీలిమ అభినందనలు తెలిపారు.

➡️