డిఆర్‌డిఎ ఉద్యోగుల సమ్మె బాట

ప్రజాశక్తి-బాపట్ల: జిల్లా డిఆర్‌డిఎ జేఏసి ఉద్యోగులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం సమ్మెలోకి దిగుతున్నట్లు జిల్లా జేఏసీ చైర్మన్‌ తాళ్లూరి శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం సమ్మె నోటీసును డిఆర్‌డిఎ పిడి సిహెచ్‌ కృష్ణకు ఆ ఉద్యోగులతో కలిసి అందజేశారు. డిఆర్‌డిఎలో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రధాన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకు సమ్మెను విరమించేది లేదని శ్రీనివాసరావు తెలిపారు. ఉద్యోగులకు పే స్కేల్‌ క్రమబద్ధీకరణ, కారుణ్య నియామకాలు, హెచ్‌ఆర్‌ఎ పెంపు పదోన్నతులు ఇంక్రిమెంట్‌ ఎంఎస్‌సిసిలకు హెచ్‌ఆర్‌ పాలసీ డిఏ పెంపుదల ఉద్యోగపరమైన ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రంలో పేర్కొన్నట్లు శ్రీనివాసరావు తెలిపారు.

➡️