డిఇఒగా శివప్రకాష్‌రెడ్డి బాధ్యతలు స్వీకరణ

ప్రజాశక్తి – రాయచోటి అన్నమయ్య జిల్లా విద్యా శాఖ అధికారిగా యు.శివ ప్రకాష్‌ రెడ్డి శనివారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. గూడూరు ఉప విద్యాశాఖ అధికారిగా పని చేస్తున్న ఆయన ఉద్యోగోన్నతిపై జిల్లా విద్యాశాఖ అధికారిగా బదిలీ అయ్యారు. జిల్లా విద్యా శాఖ ప్రధాన కార్యాలయంలో పూర్తి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది, ఉపాధ్యాయ సంఘం నాయకులు నూతనంగా బాధ్యతలు చేపట్టిన శివప్రకాష్‌ రెడ్డిని కలిసి పూల గుత్తి ఇచ్చి, దుశ్శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య సమస్యలు తీర్చడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, అందుకు సిబ్బంది, సంఘ నాయకులు సహాయ సహకారాలు అందించాలని కోరారు.డిఇఒను సన్మానించిన ఉపాధ్యాయులు పీలేరు : జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన యు.శివప్రకాష్‌రెడ్డిని శనివారం పీలేరు డివిజన్‌ ఎస్‌టియు నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం, దుశ్శాలువతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్‌టియు ఉమ్మడి చిత్తూరు జిల్లా మాజీ అధ్యక్షులు గంగిరెడ్డి, జగన్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కొత్తగా వచ్చిన డిఇఒ చొరవ చూపాలని కోరినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎస్‌టియు ఆర్థిక కార్యదర్శి వేణుగోపాల్‌రెడ్డి, పీలేరు మండల అధ్యక్షులు భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర కౌన్సిలర్‌ అమర్నాథ్‌రెడ్డి, కలకడ మండల అధ్యక్షులు శ్రీనివాసరావు పాల్గొన్నారు.

➡️