డివైడర్‌ను ఢకొీని యువకుడు మృతి

ప్రజాశక్తి- డెంకాడ : మండలంలోని నాతవలస 16వ జాతీయ రహదారి టోల్గేట్‌ సమీపంలో డివైడర్‌ను ఢకొీని శనివారం యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. నాతవలస గ్రామానికి చెందిన గేదెల ప్రవీణ్‌ కుమార్‌ (29) తన మోటార్‌ సైకిల్‌ పై నాతవలస టోల్‌ప్లాజా నుంచి తిరిగి తన స్వగ్రామానికి వస్తున్న సమయంలో బైక్‌ అదుపు తప్పి డివైడర్‌ను బలంగా ఢకొీన్నాడు. ఈప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య గంగోత్రితో పాటు సంవత్సరం ఆరు నెలల బాబు ఉన్నాడు. మృతుడు నాతవలస టోల్‌ గేట్‌లో పనిచేస్తున్నాడు. భార్య ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్‌ఐ యు మహేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

➡️