డెడ్‌ స్టోరేజీకి చేరిన నీటిమట్టం

ప్రజాశక్తి-చీమకుర్తి: రామతీర్థం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో నీటిమట్టం డెడ్‌ స్టోరేజీకి చేరింది. గత ఇరవై రోజులుగా ఒంగోలు-1, ఒంగోలు-2 సమ్మర్‌ స్టోరేజీలను 75శాతం రామతీర్థం నీటితో నింపారు. వేసవి దృష్ట్యా ప్రభుత్వం పది రోజులపాటు సాగరు జలాలతో రామతీర్థం రిజర్వాయర్‌కు నీటిని వదిలారు. గత ఇరవై రోజులుగా ఒంగోలు సమ్మర్‌ స్టోరేజీ-1, ఒంగో లు సమ్మర్‌ స్టోరేజీ-2లను, కారుమంచి కాలువ కింద ఉన్న రెండు మంచినీటి చెరువులను, త్రోవగుంట మేజరు కాలువ కింద ఉన్న 10 మంచినీటి చెరువులను, చీమకుర్తి చెరువును రామతీర్థం జలాశయం నుంచి నీటితో నింపా రు. శుక్రవారం సాయంత్రం నీటిని రిజర్వాయర్‌ నుంచి కిందికి వదలడం ఆపేశారు. ప్రస్తుతం డెడ్‌స్టోరేజీ 75 మీటర్లు నీటిమట్టం ఉంది. ఏప్రిల్‌ నెలలో వేసవి దృష్ట్యా మళ్లీ రామతీర్థం రిజర్వాయర్‌కు సాగరు జలాలు వదిలే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

➡️