‘డైట్‌’లో ఎన్‌సిటిసిటి జాతీయ సదస్సు

'డైట్‌'లో ఎన్‌సిటిసిటి జాతీయ సదస్సు

ప్రజాశక్తి- అనకాపల్లి : స్థానిక డైట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో డైట్‌ సిఎస్‌ఇ, సిఎస్‌డిఎం విభాగం, కంప్యూటర్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా (సిఎస్‌ఐ) స్టూడెంట్‌ చాప్టర్‌ ఆధ్వర్యంలో ‘ట్రెండ్స్‌ ఇన్‌ కంప్యూటింగ్‌ టెక్నాలజీపై జాతీయసదస్సు నిర్వహించారు. ఎన్‌సిటిసిటి కోకన్వీనర్‌ ఎ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కాన్ఫరెన్స్‌, వర్కుషాప్స్‌ నిర్వహణలో విద్యార్థుల్లో సాంకేతికత, నైపుణ్యశిక్షణ పెంపొంది ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయన్నారు. ఎన్‌సిటిసిటి కన్వీనర్‌ డాక్టర్‌ కె.సుజాత మాట్లాడుతూ ఈ సదస్సులో వివిధ కాలేజీల నుంచి 150 పత్రాలురాగా, వాటిలో ఉత్తమమైన వందింటిని ఎంపిక చేశామన్నారు. ప్రిన్సిపాల్‌ ఆర్‌.వైకుంఠరావు మాట్లాడుతూ ప్రతి నెలా విద్యార్ధులకు ఉపయోగపడే కార్యకలాపాలు నిర్వహిస్తున్నా మన్నారు. ముఖ్యఅతిథులు సి. ఉదరుకుమార్‌, విఎల్‌పి లాల్‌ మాట్లాడుతూ విద్యార్థుల అకడమిక్‌ కెరీర్‌కు ఉపయోగపడే కార్యక్రమాలను నిర్వహిస్తున్న డైట్‌ పాలకమండలి, యాజమాన్యాన్ని అభినందించారు. .డైట్‌ చైర్మన్‌ దాడి రత్నాకర్‌ మాట్లాడుతూ డైట్‌లో కంప్యూటర్‌ విభాగం యాక్టివ్‌గా ఉందన్నారు. సదస్సులో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లను, కొత్త సభ్యులకు గుర్తింపుకార్డులను అందజేశారు.

జాతీయ సదస్సు ప్రారంభిస్తున్న ముఖ్యఅతిథులు

➡️