డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలి

మంగళగిరిలో పర్యటిస్తున్న మురుగుడు హనుమంతరావు

మంగళగిరి: మంగళగిరి పట్టణ పరిధిలో హుస్సేన్‌ కట్ట రోడ్డు మొదలు కొప్పురావు కాలనీలోని 8,9 వ లైను చివరి వరకు డ్రైనేజ్‌ పారు దలకు సంబంధించి తెలుసుకునేందుకు ఎమ్మెల్సీ, రాష్ట్ర శాసన మండలి ఎథిక్స్‌ కమిటీ చైర్మన్‌ మురుగుడు హనుమంతరావు బుధవారం పర్యటించారు. స్థానికులు ఎదుర్కొంటున్న డ్రైనేజ్‌ సమస్యలపై స్పందిస్తూ కార్పొరేషన్‌ అధికారులకు పలు సూచ నలు చేశారు. సిల్ట్‌ సమస్యలు, కాల్వలకు మరమ్మత్తులు, స్థంభించిన మురుగును తోడుట, దుర్గంధం లేకుండా చూడాలని, సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపడుతూ బ్లీచింగ్‌ చేయాలని, రెండు రోజులకొకసారి ఫాగింగ్‌ ఒక పర్యాయం చేసేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు చెప్పారు.

➡️