తడిసిన ధాన్యంను కొనుగోలు చేస్తాం

Dec 4,2023 17:43
హశీల్దార్‌ సాయి సత్యనారాయణ,

ప్రజాశక్తి – కాజులూరు

తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల వల్ల తడిసిన ధాన్యంను సైతం కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ తెలిపారు. సోమవారం మండలంలోని పలు గ్రామాల్లో రైతులకు చెందిన ధాన్యం రాశులు పోసిన ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు అన్ని విధాల మేలు చేసే విధంగా చర్యలు చేపట్టిందని, రైతులు వద్ద ఉన్న ధాన్యం అంతా కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. అందుకు రైతులు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. వర్షం కొంచెం తెరిపిచ్చిన వెంటనే ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, సంచులు, కాటా, ట్రాక్టర్లు, లారీలు అన్ని సిద్ధంగా ఉన్నాయన్నారు. ఏ రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. రైతులు ఎవరూ ఇబ్బందులు పడకూడదని ప్రభుత్వం భావిస్తుందన్నారు. ఈ పర్యటనలో తహశీల్దార్‌ సాయి సత్యనారాయణ, వ్యవసాయ శాఖ అధికారి అశోక్‌, సర్పంచ్‌లు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️