తరతరాలకు తెలుగు వెలుగుల దీప్తి గురజాడ

Nov 30,2023 20:39

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌: తెలుగు సాహిత్యంలో తరతరాలకు దారి చూపే తెలుగు వెలుగుల దీప్తి మహాకవి గురజాడ అప్పారావు అని ప్రముఖ కవి, రచయిత, గంటేడ గౌరినాయుడు అన్నారు. గురజాడ వెంకట అప్పారావు 108వ వర్ధంతి సందర్భంగా గురువారం స్థానిక జిల్లా కేంద్రాసుపత్రి కూడలిలో ఉన్న మహాకవి విగ్రహానికి సాహితీ లహరి వ్యవస్థాపకులు, ప్రముఖ వైద్యులు డాక్టర్‌ మంచిపల్లి శ్రీరాములుతో కలిసి, స్నేహ కళా సాహితి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గురజాడ అప్పారావు దేశభక్తి గీతాలను ప్రముఖ కవి సిరికి స్వామి నాయుడు ఆలపించగా, తెలుగు సాహిత్యానికి గురజాడ చేసిన సేవలు గురించి వక్తలు ప్రసంగించారు.

➡️