తాగునీటి సమస్య పరిష్కారానికే క్రాస్‌ ప్రోగ్రామ్‌

Mar 1,2024 20:54

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : ఈ వేసవిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు తాగునీటికి ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఉండేందుకు క్రాస్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభించామని ఎంపిపి కే.దీనమయ్య అన్నారు. శుక్రవారం ఆయన స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో క్రాస్స్‌ ప్రోగ్రాం వాహనాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈ వేసవి కాలంలో ప్రజలకు మంచినీటిని తాగేందుకు ఎట్టి పరిస్థితులల్లో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గాను ఇటువంటి క్రాస్‌ ప్రోగ్రామ్‌లు ఎంతగానో ఉపయోగపడతా యన్నారు. మండలంలో ఉన్న 27 పంచాయతీల్లో ఎక్కడైనా మంచినీటి చేతి పంపులు గానీ, బోర్లు గానీ పాడైతే తక్షణమే సంబంధిత సచివాలయ సిబ్బందికి గాని, ఆర్డబ్ల్యూఎస్‌ అధికారులకు గానీ సమాచారం అందించాలన్నారు. అనంతరం ఆర్డబ్ల్యూఎస్‌ కురుపాం సబ్‌ డివిజన్‌ డిఇ కే. నాగేశ్వరరావు మాట్లాడుతూ మండలంలో మంచినీటి చేతిపంపులు రక్షిత మంచినీటి పథకాలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలుగా కొత్త చేతి పంపులు, బోరు గొట్టాలు తదితర సామాన్లు అందుబాటులో ఉంచామన్నారు. ఈ క్రాస్‌ ప్రోగ్రాం సుమారు నెలరోజుల పాటు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ జి జగదీష్‌ కుమార్‌, ఎఇ ప్రవీణ్‌ కుమార్‌, బిసి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ గిరిబాబు, ఆర్డబ్ల్యూఎస్‌ సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.పల్స్‌ పోలియో విజయవంతం చేయండి ఈనెల 3న నిర్వహించనున్న పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని అధికారులు, వైద్య సిబ్బంది విజయవంతం చేయాలని ఎంపిపి దీనమయ్య, ఎంపిడిఒ జగదీష్‌ కుమార్‌లు కోరారు. శుక్రవారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన పల్స్‌ పోలియో కార్యక్రమ సమీక్ష సమావేశంలో పాల్గొని మాట్లాడారు. దేశమంతటా ఈనెల 3న నిర్వహించనున్న చిన్నారులకు పోలియో చుక్కలు కార్యక్రమాన్ని ప్రణాళిక ప్రకారం విజయవంతం చేయాలన్నారు. ఆరోజు ఉదయం 8 గంటల నుంచి వైద్య సిబ్బందికి నిర్దేశించిన ప్రకారం ఆయా కేంద్రాల వద్దకు చేరుకొని చిన్నారులకు పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో తాడికొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు ఎం. బుద్దేశ్వర రావు, పాల్గొన్నారు.

➡️