తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల పర్యటన : బండేటి

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌

మిచౌంగ్‌ తుపాను దాటికి అతలాకుతలమైన ప్రాంతాల్లో ఏలూరు టిడిసి ఇన్‌ఛార్జి బండేటి రాధాకృష్ణ పర్యటించారు. తుపాను బాధితులను పరామర్శించారు. తమ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టిడిపి నేతలు, కార్యకర్తలు తుపాను బాధితులకు అండగా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు. ఈక్రమంలో జిల్లా ఆసుపత్రిలో పరిస్థితిని సమీక్షించారు. ఆసుపత్రి అంతా కూడా వరద నీటితో మునిగిపోయి ఉండడాన్ని గమనించారు. దీంతో అక్కడ ఉన్న వరద నీటిని ప్రహరీ గోడకు అవతలివైపు ఎత్తిపోసి నిరసన తెలిపారు. స్థానికంగా ఉండే ఎంఎల్‌ఎ ఆళ్ల నాని గతంలో ఆరోగ్య మంత్రిగా చేసినా ఏలూరు ఆసుపత్రికి చేసిందేమి లేదని, ఈ కారణంగానే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. ఆసుపత్రి సిబ్బందితో కలిసి ప్లోర్‌ను శుభ్రం చేశారు. రోగుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు.

➡️