తుపాన్‌ బాధితులకు పరిహారం చెల్లించాలి : టిడిపి

Dec 23,2023 17:57
వినతిపత్రం అందేస్తున్న దృశ్యం

వినతిపత్రం అందేస్తున్న దృశ్యం
తుపాన్‌ బాధితులకు పరిహారం చెల్లించాలి : టిడిపి
ప్రజాశక్తి -పొదలకూరు
మిచాంగ్‌ తుపాన్‌ వల్ల నష్టపోయిన ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ కుటుంబాలకు వెంటనే నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని టిడిపి మండల అధ్యక్షులు తలచీరు మస్తాన్‌బాబు, పట్టణ అధ్యక్షుడు బొద్దులూరి మల్లికార్జున్‌ నాయుడు, తిరుపతి పార్లమెంట్‌ మైనార్టీ సెల్‌ ఉపాధ్యక్షులు షేక్‌ జమీర్‌ భాష డిమాండ్‌ చేశారు. శనివారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహ శీల్దార్‌ వీర వసంత రావుకి వినతిపత్రం అందజేశారు. కోడూరు పెంచల భాస్కర్‌ రెడ్డి అక్కెం సుధాకర్‌ రెడ్డి, బక్కయ్య నాయుడు,ఆదాల సుగుణమ్మ, కొంగి మస్తానమ్మ, వెంకటరమణయ్య, నారప నాయుడు, సుబ్బా నాయుడు గంట మల్లికార్జున యాదవ్‌, మద్దిరల్ల పెంచల స్వామి, కలగట్ల సందీప్‌, సాదం గిరి, ఆదాల మురళి, బాలచంద్ర, ఓబుల్‌ రెడ్డి ఉన్నారు.

➡️