తులసమ్మా… ఆస్పత్రికి తీసుకెళ్తా రామ్మా!

Jan 27,2024 21:36

ప్రజాశక్తి-మక్కువ: మండలంలోని దేవరశిర్లాం పరిధిలోని మెట్టలోవరకండి గ్రామానికి చెందిన తులసమ్మ అనే గర్భిణికి 9 నెలలు పూర్తికావస్తున్నాయి. ఈ సమయంలో ఇంటి వద్ద ప్రసవం మంచిది కాదని, ఆస్పత్రికి వెళ్దామని ఎఎన్‌ఎం మంగ ఆమెను బతిమలాడసాగింది. ఆ మహిళకు ఉండే అనారోగ్య కారణాల వల్ల విజయనగరం జిల్లా కేంద్రంలోని ఘోషా ఆస్పత్రిలో మాత్రమే ప్రస్తుతం ప్రసవం చేయించాల్సి ఉంటుందని ఆ కుటుంబానికి ఎఎన్‌ఎం నచ్చజెప్పింది. ఎంత మాత్రమూ ఆస్పత్రిలో ప్రసవానికి రాలేనంటూ ఆమె మొండికేస్తూ వచ్చింది. శనివారం ఆ గ్రామాన్ని మీడియా బృందం సందర్శించగా, ఆ మహిళను ఎఎన్‌ఎం మంగ ఒప్పిస్తున్న దృశ్యం కనిపించింది. ఆమెకు తెలుగు భాష కొంచెం రావడంతో భర్త రాజు, ఎఎన్‌ఎంతోపాటు మీడియా ప్రతినిధులు కూడా వివరించారు. దీంతో ఆమె సోమవారం స్కానింగుకు పార్వతీపురం జిల్లా ఆస్పపత్రికి వెళ్లేందుకు అంగీకరించింది.

➡️