తూర్పు కాపుల నిరసన

Mar 15,2024 20:20

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : తూర్పు కాపులు అత్యధికంగా ఉన్నచోట్ల ఎంపి,ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వాలని రాజకీయ పార్టీలను తూర్పు కాపు సామాజిక వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు మజ్జి అప్పారావు, జిల్లా అధ్యక్షులు రొంగలి రామారావు డిమాండ్‌ చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌ ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. దీక్షను ఉద్దేశించి వారు మాట్లాడుతూ జిల్లాలో అత్యధికంగా కాపు సామాజిక వర్గం ఓటర్లు ఉన్నారన్నారు. రాజ్యాధికారం ఇవ్వడంలో రాజకీయ పార్టీలు తూర్పు కాపుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు బాధాకరమన్నారు. తూర్పు కాపులంతా ఏకమై రాజ్యాధికారం కోసం సాధించుకోవడానికి ముందుకు రావాలని కోరారు. తాము జెండాలు మోసెందుకి లేమని రాజ్యాధికారం కావాలని డిమాండ్‌ చేశారు. నిరసన దీక్ష లో ఎం.రామారావు, ఎస్‌.సాంబ, జి.మోహనరావు, టి.వెంకటరావు, ఎస్‌.సత్యన్నారాయణ, సిహెచ్‌ చిన్ని, జి.వెంకట రమణి, పి.రామారావు, పి.సన్నిబాబు తదితరులు పాల్గొన్నారు.

➡️