తొలి సోషలిస్ట్‌ విప్లవ నేత లెనిన్‌

తొలి సోషలిస్ట్‌ విప్లవ నేత లెనిన్

ప్రజాశక్తి-యంత్రాంగం సోషలిస్టు మహా విప్లవనేత విఐ.లెనిన్‌ శత వర్థంతి సందర్భంగా జిల్లాలోని పలుచోట్ల ఆదివారం ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ప్రపంచ శ్రామిక వర్గానికి దారి చూపిన మహోన్నతుడని కొనియాడారు. కాకినాడ మార్క్సిస్టు సిద్ధాంతాన్ని నిర్ధిష్ట పరిస్థితుల్లో నిర్ధిష్టంగా అమలు చేయడం ఎలాగో కార్మికవర్గానికి బోధించి, ప్రపంచంలోనే తొలి సోషలిస్టు విప్లవాన్ని విఐ.లెనిన్‌ సాధించారని పలువురు వక్తలు పేర్కొన్నారు. సుందరయ్య భవన్‌లో కె.వీరబాబు అధ్యక్షతన నిర్వహించిన సభలో సిపిఎం జిల్లా కన్వీనర్‌ ఎం.రాజశేఖర్‌, పార్టీ సీనియర్‌ నాయకులు దువ్వా శేషబాబ్జి మాట్లాడారు. మార్క్స్‌, ఎంగెల్స్‌ తరువాత మార్క్సిస్టు మహోపాధ్యాయునిగా లెనిన్‌ చరిత్రలో చిరస్థానం సంపాదించుకున్నారని తెలిపారు. సిపిఎం నాయకులు పలివెల వీరబాబు, తిరుమలశెట్టి నాగేశ్వరరావు, ఆర్‌పిఐ రాష్ట్ర నాయకులు అయితాబత్తుల రామేశ్వరరావు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిహెచ్‌.రమణి, కె.సింహాచలం, సిహెచ్‌.అజరు కుమార్‌, టి.రాజా, మేడిశెట్టి రమణ, ఈశ్వరి, వేణి, మలకా రమణ, జుత్తుక శ్రీనివాస్‌, రెడ్డి పాల్గొన్నారు. నగర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్‌ సెంటర్‌లో నివాళులు అర్పించారు. దువ్వా శేషబాబ్జి, సిహెచ్‌.సత్యనారాయణరాజు, నగర కన్వీనర్‌ పలివెల వీరబాబు, నగర కమిటీ సభ్యులు మలక వెంకట రమణ, కె.నాగజ్యోతి, సిహెచ్‌.వేణు, నర్ల ఈశ్వరి, వర్మ, ఎ.ఏడుకొండలు, భూలక్ష్మి, నాగలక్ష్మి, సతీష్‌, రవి, కె.రాజుబాబు, వెంకట రమణ, చంద్రరావు, నాగేశ్వరరావు, రాజా తదితరులు పాల్గొన్నారు.తాళ్లరేవు ప్రజాసంఘాల భవనంలో సిపిఎం జిల్లా నాయకులు కెఎస్‌.శ్రీనివాస్‌ మాట్లా డారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు టేకుమూడి ఈశ్వరరావు, వల్లు రాజబాబు, దుప్పి అదృష్టదీపుడు, పాలెపు ఈశ్వరరావు, ఆదిలక్ష్మి, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సామర్లకోట రూరల్‌ సిపిఐ పట్టణ కార్యదర్శి పెదిరెడ్ల సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన సభలో తాటిపాక మధు, జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, ఎఐటియుసి రాష్ట్ర నాయకులు పిఎస్‌ నారాయణ, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు బచ్చ శీను, కసింకోట ఆనందరావు, రామకష్ణ, ఎలిశెట్టి రామదాసు, సప్త సూరిబాబు, బర్ల లక్ష్మీనారాయణ, అడపా చిట్టిబాబు, దరంపూడి రాజు, అల్లూరి భద్రం, సోమాధుల సింహాచలం, మంగళగిరి దుర్గా మనమ్మ, మనీ అల్లం అప్పారావు గూడూపు బాలయ్య చెన్నవెంకటేశ్వర్లు పాల్గొన్నారు.కాకినాడ రూరల్‌ వలసపాకలు సుందరయ్య కాలనీలో సిఐటియు ఆధ్వర్యంలో లెనిన్‌ లెనిన్‌ చిత్రపటానికి తిరుమలశెట్టి నాగేశ్వరరావు, మేడిశెట్టి వెంకటరమణ పూలమాలవేసి నివాళులర్పించారు. సిఐటియు రూరల్‌ కన్వీనర్‌ టి.రాజా, నాయకులు శ్రీహరి, డి.సత్యనారాయణ, దుర్గాప్రసాద్‌, రాంబాబు, శ్రీను, రాము పాల్గొన్నారు.

➡️