దున్నపోతులకు వినతులు

Jan 2,2024 21:33

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ కడప జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం నాటికి 22వ రోజుకు చేరుకుంది. జిల్లా వ్యాపితంగా దున్నపోతుకు వినతి పత్రాలు ందజేసి ప్రభుత్వంపై వ్యతిరేకతను ప్రదర్శిస్తూ నిరసన తెలియజేశారు. మరికొన్ని చోట్ల ఆకులు, ఆలుములు తింటూ, ఇంకొన్ని చోట్ల మోకాళ్లపై నిల్చుని ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంగన్వాడీలు మాత్రం సమస్యలు పరిష్కారమయ్యే వరకూ సమ్మె విరమించేది లేదంటూ నినాదాలు చేశారు. పులివెందుల టౌన్‌ : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయ ఆవరణంలో 22వ రోజైన మంగళవారం అంగన్వాడీలు నిరసన తెలియజేశారు. సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మ ఆగదని చెప్పారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. ముద్దనూరు : అంగన్వాడీల డిమాండ్లు పరిష్కరించాలని స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు చేపట్టిన సమ్మెకు మంగళవారం ఉపాధ్యాయులు మద్దతు తెలిపారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డుమాండ్‌ చేశారు.. ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలని నినాదాలు చేశారు. ప్రొద్దుటూరు : తమ న్యాయమైన కోర్కెలుసాధించుకునేందుకు అంగన్వాడీ కార్యకర్తలు 22రోజులుగా సమ్మె చేస్తుంటే వారి పట్ల ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం తగదని సిఐటియు జిల్లా కార్యదర్శి సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వ విధానానికి నిరసనగా పాతబస్టాండ్‌లోని అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి అనంతరం రాజీవ్‌సర్కిల్‌లో కొద్దిసేపు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం అంగన్వాడీలు ఆకులు తింటూ నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూని యన్‌ కార్యదర్శి సుబ్బలకిë, నాగలకిë, రాణి, సువార్తమ్మ సునీత, అర్బన్‌ అంగన్వాడీలు పాల్గొన్నారు. కడప అర్బన్‌ : అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 5 నుంచి విధుల్లో చేరాలని ఆదేశాల పత్రాలు జారీ చేయడంతో మంగవారం ఆ ప్రతులను అంగన్వాడీలు రూరల్‌ కార్యాలయం ఎదుట దహనం చేశారు. కార్యక్రమంలో ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.లక్ష్మిదేవి, నాయకులు నాగలక్ష్మి,తులసి, కష్ణవేణి, సంటేమ్మ, సావిత్రి,రెడ్డెమ్మ, ఈశ్వరమ్మ, గంగోజి పాల్గొన్నారు. అర్బన్‌ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న సమ్మెకు సిపిఎం జిల్లా కార్యదర్శి జి. చంద్రశేఖర్‌, డివైఎఫ్‌ఐ నాయకులు ఓబులేసు సంఘీభావం తెలియజేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ నాయకురాలు దీప, వసుంధర, వినీల, రమా, పోలమ్మ, వరలక్ష్మి పాల్గొన్నారు. సమ్మెకు యుటిఎఫ్‌ఎఫ్‌, జెవివి నాయకులు సంఘీభావం తెలియజేశారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బి. లక్ష్మిరాజ, జెవివి రాష్ట్ర కార్యదర్శి బి. రాజశేఖర్‌, జెవివి మహిళా విభాగం కన్వీనర్‌ సునీత, నగర నాయకులు శివరాం, ఉపాధ్యాయులు సుందరం పాల్గొన్నారు. చాపాడు : 22 రోజులుగా తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీలు సమ్మె నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు సుజాత, కార్యకర్తలు, అంగన్వాడీ, కార్యక ర్తలు, ఆయాలు పాల్గొన్నారు. మైదుకూరు : 22 రోజులుగా అంగన్వాడీలు తమ డిమాండ్లను పరిష్కరించాలని సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడినట్లుగా చలించకుండా ఉందని అందుకు నిరసనగ అంగన్వాడీలు దున్నపోతుకు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు ధనలక్ష్మి, భారతి, చెన్నమ్మ కార్యక్రమంలో అంగన్వాడీ నాయకులు జి.లక్ష్మీదేవి, లక్ష్మి, శ్యామల, రాధ, శివలక్ష్మి పాల్గొన్నారు. పోరుమామిళ్ల : పట్టణంలోని తహశీల్దార్‌ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వ ర్యంలో 22 రోజు అంగన్వాడీలు సమ్మె నిర్వహించారు. అనంతరం దున్న పోతుకు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్‌. భైరవప్రసాద్‌, సిఐటియు మండల నాయకులు బొజ్జా, గుర్రయ్య, పోరుమామిళ్ల ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు దస్తగిరిమ్మ, జ్యోతిమ్మ, లీలావతి, స్వాతి, రేణుక, రమాదేవి, శ్రీదేవి ,అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు. జమ్మలమడుగు : పట్టణంలోని ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో సమ్మె 22 రోజుకు చేరడంతో ఆకులు, అలములు తింటూ వినూత్న రీతిలో అంగన్వాడీలు నిరసన చేపట్టారు. మంగళవారం జమ్మలమడుగు పట్టణంలోని ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదురుగా అంగన్వాడీలు నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి సిఐటియు జిల్లా ప్రధాన కార్యద ర్శి మనోహర్‌, సిపిఎం జమ్మలమడగు కార్యదర్శి ఏసుదాసు మద్దతు తెలియజేసి మాట్లాడారు. కార్యక్రమంలో అంగన్వాడీ నాయకులు భాగ్యమ్మ, సిఐటియు నాయకులు దాసరి విజరు, లక్ష్మీదేవి, జ్యోతి, నరసమ్మ, నాగలక్ష్మి పాల్గొన్నారు. వేంపల్లె: స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద నిర్వ హిస్తున్న సమ్మె మంగళవారం 22వ రోజుకు చేరింది. ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగ సుబ్బారెడ్డి, డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ కెసి బాదుల్లా సంఘీభావం తెలిపారు. సమ్మె కార్యక్రమంలో అంగన్వాడీలు పాల్గొన్నారు. బద్వేలు : స్థానిక బద్వేలు సమగ్ర శిశు అభివద్ధి అధికారి కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) బద్వేల్‌ ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో 22 రోజు మంగళవారం రాష్ట్ర వ్యాప్త సమ్మె నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ తీరును నిరసిస్తూ దున్నపోతుకు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో యూనియన్‌ ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి ఆర్‌.హుసేనమ్మ, వ్యవసాయ కార్మిక సంఘం గోపవరం మండల నాయకులు కదిరయ్య, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని, పట్టణ ఉపాధ్యక్షులు జి.వి రమణారెడ్డి, ఎస్‌.ఆదిల్‌, అంగన్వాడీ యూనియన్‌ గౌరవ అధ్యక్షురాలు కె. సుభాషిని, ప్రాజెక్టు నాయకులు సత్యవతి, కళావతి, విజయమ్మ, తులసమ్మ, వెంకట నరసమ్మ, వసంతమ్మ, శ్రీలత, లీలావతి, కళావతి, కష్ణవేణి, ప్రవీణ, ఉమాదేవి, లక్ష్మీ నరసమ్మ, మహాలక్ష్మి ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

➡️