దుప్పిని స్వాధీనం చేసుకున్న అధికారులు

దుప్పి స్వాధీనం

ప్రజాశక్తి – సీతానగరంకుక్కల దాడిలో గాయపడిన దుప్పిని అటవీశాఖ అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 1వ తేదీన అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం అటవీ ప్రాంతంలో ఒక వ్యక్తి మేకలు మేపుతూ సాయంత్రం ఇంటికి వస్తుండగా మేకలతో కలిసి ఒక దుప్పి వచ్చింది. దుప్పిపై కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. మేకల కాపరి దుప్పిని ఇంటికి తీసుకుని వెళ్లి సంరక్షించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సోమవారం డిప్యూటీ ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ పద్మావతి ఆధ్వర్యంలో అచ్చియ్యపాలెంలో ఉన్న దుప్పిని స్వాధీనం చేసుకుని రాజమండ్రి ప్రధాన అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆవాస ప్రాంతానికి దుప్పిని తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌డిఒ జివి.రంగారావు, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

➡️