‘ద మేజర్‌ థీమ్స్‌’ పుస్తకావిష్కరణ

Mar 9,2024 21:25

ప్రజాశక్తి- విజయనగరం: నగరానికి చెందిన ప్రొఫెసర్‌ విశ్వేశ్వరరావు చనమల్లు, సీతం ఇంజినీరింగ్‌ కళాశాల ప్రొఫెసర్‌ ఎన్‌. సతీష్‌ కుమార్‌లు రచించిన ‘ద మేజర్‌ థీమ్స్‌ అండ్‌ కన్సర్న్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ క్యాంపస్‌ నోవెల్‌’ అనే పుస్తకాన్ని మాజీ ఎమ్‌పి డాక్టర్‌ బొత్స ఝాన్సీలక్ష్మి, సీతం కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ మజ్జి శశిభూషణరావు, ధీర ఫౌండేషన్‌ అధ్యక్షులు డాక్టర్‌ బొత్స సందీప్‌ చేతుల మీదుగా ఆదివారం ఆవిష్కరించారు. ఈ నవలలో రచయితలు భావి తరాలకు ఉపయోగపడే విషయాలను క్రోడీకరించి, వాటిని తొమ్మిది భాగాలుగా వర్గీకరించి ప్రస్తుత పుస్తకం రచించారని తెలిపారు. ఈ పుస్తకం ఆవిష్కణ సందర్భంగా డాక్టర్‌ బొత్స ఝాన్సీలక్ష్మి రచయితలను అభినందిస్తూ, మరిన్ని పుస్తకాలను రచించాలాని కోరారు. పుస్తక రచన, పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని కోరారు. ఈ పుస్తకం మున్ముందు ఉన్నత విద్యను అభ్యసించబోయేవారికి బాగా ఉపయోగ పడుతుందని మజ్జి. శశిభూషణ రావు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ పుస్తకంలో చాలా విషయాలను చాలా చక్కగా పొందుపరచారని పేర్కొంటూ బొత్స సందీప్‌ రచయితలను అభినందించారు. ఈ పుస్తకావిష్కరణలో రఘు ఇంజనీరింగ్‌ కళాశాల అధ్యాపకులు రోహిణి చనమల్లు, వసంత హైస్కూల్‌ సైన్స్‌ ఉపాధ్యాయుడు సిరిపురపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

➡️