ధాన్యం కొనుగోలు ప్రక్రియ పరిశీలిన

పరిశీలిస్తున్న అగ్రిబోర్డ్‌ వైస్‌ ఛైర్మన్‌ నాగిరెడ్డి

ప్రజాశక్తి-రామచంద్రపురం

కె.గంగవరం మండలంలో దంగేరు ఆర్‌బికెలో ధాన్యం కొనుగోలు ప్రక్రి యను రాష్ట్ర అగ్రి మిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ నాగిరెడ్డి పరిశీలించారు. పలు అంశాలపై ఆయన వివరాలు ఆర్‌బికె సిబ్బందిని అడిగి తెలుసు కున్నారు. తొలకరి పంట ఇప్పటి వరకు గ్రామంలో ఎంత మేర కొను గోలు చేశారని, మండలంలో ఎంత మంది దగ్గర ధాన్యం కొనుగోలు చేశారో రిపోర్ట్స్‌, రైతులు ఖాతాల్లో సొమ్ములు ఎన్ని రోజుల్లో జమ అవుతున్నాయి అని తెలుసుకున్నారు. తుపాను వలన జరిగిన నష్టం, ధాన్యంలో తేమ శాతం కొరకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు పడుతు న్నా రనీ వ్యవసాయ శాఖ సిబ్బంది అడిగి తెలుసు కున్నారు. తేమ శాతం విషయంలో ధాన్యం కొనుగోలు సిబ్బంది ఆచరించ వలసిన విధా నాలు, తీసుకోవాల్సినజాగ్రత్తలు కొను గోలు సిబ్బందికి వివరించారు. రైతులకు ఇంకా ఏ విధమైన సేవలు అందించాలన్న విషయంలో ప్రత్యే కంగా ఫీల్డ్‌లో స్వయంగా పర్యటిస్తున్నట్టు ఆయన తెలియజేశారు. ఆర్‌బికెలో ఇస్తున్న సేవలకు ఆయన రిజిష్టర్‌లో సంతకం చేశారు. కార్య క్రమంలో వైఎస్‌ఆర్‌ హార్ట్టీ కల్చర్‌ సభ్యులు జిన్నూరి వెంకటేశ్వరరావు, ఆయనతో పాటు ఉన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ సహాయకులు శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️